ఐటెం సాంగ్స్ చేస్తే తప్పేంటి

Rashmi About Item Songs

10:32 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Rashmi About Item Songs

ఒరిస్సాలో పుట్టినా, పెరిగింది అంతా వైజాగ్‌ లోనే కావడంతో పట్టుపట్టి తెలుగు నేర్చుకుని, ‘జబర్దస్త్‌’ తో యువతను మెస్మరైజ్‌ చేసిన రెష్మీ ఈ మధ్య గుంటూర్ టాకీస్ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలతో కుర్రకారుని పిచ్చెక్కించింది. వాస్తవానికి మొదట్లే వెండితెరకు వచ్చినా అటు తర్వాత బుల్లితెర కు చేరి, మళ్ళీ ఇప్పుడు వెండితెర చాటుకు వచ్చేసింది. ఈ భామ ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో మొత్తం పదకొండు సినిమాల వరకూ చేసినా పాపం సరైన బ్రేక్‌ రాలేదనే చెప్పాలి. అందుకే బ్రేక్‌ ఇచ్చిన బుల్లితెర మీద మమకారం మూటగట్టుకుంది. ఇక వెండితెర మీద బ్రేక్‌ కోసం తహతహలాడిపోతోంది. గుంటూరు టాకీస్ లో రెచ్చిపోయిన రెష్మీ నటనపై విమర్శలు గుప్పుమంటున్నాయి. దీనికి ఈ అమ్మడు స్పందిస్తూ "తెర మీద చూసినప్పుడు ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో తెలియదు. అయితే అవి చేయడానికి మాత్రం చాలా కసరత్తే చేశా. తెలియని వ్యక్తులతో రొమాంటిక్‌ సాంగ్‌ అంటే ఇబ్బందే అందుకే సిద్దూ నేనూ కలిసి కొన్ని రోజులు క్లోజ్‌గా తిరిగాం ఇద్దరి మధ్యా బాగా చనువు ఏర్పడిన తరువాతే ఆ సాంగ్‌, సన్నివేశాలు చేశా" అంటూ వివరించింది.

అది సరే, ఐటెం సాంగ్ లవైపు వెళుతున్నట్టు వుంది అని కదిలిస్తే, ఈ భామకు కొంచెం కోపం చిర్రెత్తు కొచ్చిందట. "నేను చేస్తే తప్పేంటి? ‘గుంటూర్‌ టాకీస్‌’ సమయంలో ఏకంగా 15 సినిమాల్లో ఐటెంసాంగ్‌ చేయమంటూ అవకాశాలు వచ్చాయి. ఐటెంసాంగ్‌ అంటూ చులకన చేస్తారు కానీ, స్టార్‌ హీరోయిన్లే ఐటెంసాంగ్స్‌ చేస్తూ కోటి రూపాయలకు పైగా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు నన్ను తప్పు బడితే ఎలా? ఒకటి మాత్రం నిజం సినిమా వస్తుంది, పోతుంది. కొన్ని రోజులకు ఆ సినిమా గురించి మరిచిపోవచ్చు. కానీ అందులో పాపులర్‌ అయిన ఐటెంసాంగ్‌ మాత్రం ఎప్పటికీ మరిచిపోరు. అందుకే అవి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు" అంటూ బల్లగుద్ది మరీ చెబుతోంది.

రష్మీ మరీ ఇంత ఘాటుగానా!

రెచ్చిపోయిన రష్మి

బెడ్‌రూమ్ సీన్‌లో విచ్చలవిడిగా రెచ్చిపోయిన రేష్మీ

English summary

Jabardasth Fame anchor Rashmi was famous for his glamour show in the Television Show and recently she acted in Guntur Talkies movie and she acted very hot in that movie.She says that she had no objection to do item songs.She asks that So many top heroines were acting in item songs and what was the wrong if she act in Item Songs.