హల్ చల్ చేస్తున్న రష్మీ-సుధీర్ ల లిప్ లాక్!

Rashmi and Sudheer liplock news going viral

04:51 PM ON 27th July, 2016 By Mirchi Vilas

Rashmi and Sudheer liplock news going viral

ప్రస్తుత కాలంలో బుల్లితెర యాంకర్ల హడావుడి సినీ హీరోయిన్లు కంటే ఎక్కువగా ఉంది. నేటి టీవీ యాంకర్స్ వారి అందాలతో ఇండస్ట్రీలో తెగ రెచ్చిపోతున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సెటిల్ అయ్యేందుకే ఇలా రెచ్చిపోతున్నారనడంలో సందేహం లేదు. హాట్ యాంకర్స్ లో రష్మీ, అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నారు. బుల్లితెరలో వీరి లేని ప్రొగ్రాం లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అసలు విషయానికి వెళితే.. ఈటీవీలో రష్మీ-సుధీర్ ఇద్దరూ కలిసి ఢీ జోడి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందులో ప్రధాన యాంకర్ గా ప్రదీప్ చేస్తున్నాడు. ఇక రష్మీ-సుధీర్ లు చేసే హడావుడితో ఈ షో అంతా రచ్చరచ్చగా మారుతుంది. ఈ షోకి సంబంధించిన రిహార్సల్ లో వీరిద్దరూ లిప్ లాక్ ని ట్రై చేశారని ఓ టీవీ ఛానల్ స్పెషల్ స్టోరీని టెలికాస్ట్ చేసింది.

దీంతో ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అయితే ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఓ డ్యాన్స్ కి సంబంధించిన ప్రాక్టీస్ లో వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నారట. దానికి సంబంధించిన ఫోటో బయటకు రాగా అది ఇప్పుడు మీడియాలో హాట్ న్యూస్ అయింది. ఇదిలా ఉంటే గతంలోనూ వీరిద్దరిపై పలు రూమర్లు వచ్చాయి. ప్రస్తుతం రష్మీ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీ షెడ్యూల్స్ ని గడుపుతుంది. మరోవైపు సుధీర్ సైతం పలు హీరోలతో సినిమాల్లో నటించాడు. మరికొన్ని సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొత్తంగా వీరిద్దరూ బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికీగాసిప్స్ మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి.

English summary

Rashmi and Sudheer liplock news going viral