అభిమానికి బంపరాఫర్ ఇచ్చిన రష్మీ!

Rashmi Gautam bumper offer to her fan

03:47 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Rashmi Gautam bumper offer to her fan

మొదట సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హాట్ బ్యూటీ రష్మీ. ఆమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో కొన్నాళ్ళు పరిశ్రమకు దూరంగా ఉంది. ఆ తరువాత 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి రష్మీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దానికోసం ఎటువంటి హద్దులు లేకుండా నటించేందుకు సిద్ధమైంది. ఇటీవల 'గుంటూరు టాకీస్' చిత్రంలో నటించిన ఈ భామ.. ఆ చిత్రంలో హాట్ హాట్ గా కనిపించి అలరించింది. ఈ చిత్రంలో ఆమె అందాల ఆరబోతకు షాక్ అయిన సెన్సార్ ఆ చిత్రానికి గాను ఏ సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక, ఈ మధ్యే రిలీజ్ అయిన 'అంతం', 'రాణి గారి బంగ్లా' సినిమాల్లోనూ చాలా హాట్ గా, బోల్డ్ గా అందాలు ఆరబోసింది రష్మీ. ఇది ఇలా ఉంటే.. రష్మీ తన అభిమానులతో ఆన్ లైన్ చాటింగ్ చేసింది. ఆ చాటింగ్ లో భాగంగా ఓ అభిమాని రష్మీని 'బీ గ్రేడ్' హీరోయిన్ అనేశాడట. అలాంటి సినిమాల్లో కాకుండా మంచి సినిమాల్లో కనిపించొచ్చు కదా అని కూడా సలహా ఇచ్చాడట. అతడి మాటలతో షాక్ తిని కోపం తెచ్చుకున్న రష్మీ.. 'మరి నువ్వే ఓ మంచి సినిమా తియ్యి. అందులో నన్ను హీరోయిన్ గా పెట్టుకో' అంటూ బంపరాఫర్ ఇచ్చి ఘాటుగానే సమాధానం ఇచ్చిందట.. మరి ఆ అభిమాని రష్మీ కోసం మంచి కదా రాసుకొస్తాడో లేక అభిమాని సలహా మేరకు రష్మీ బోల్డ్ గా కనిపించడం మానేస్తుందో చూడాలి మరి.

ఇది కూడా చదవండి: కమల్ ని మించిపోయిన కార్తీ.. 'కాష్మోరా'లో కార్తీ ఎన్ని గెటప్ లు వేశాడో తెలుసా?

ఇది కూడా చదవండి: డ్యూటీలో చేరిన మూడు రోజుల్లోనే.. ఎస్సై ఏం చేసాడో తెలుసా?

ఇది కూడా చదవండి: శ్రీకృష్ణుడు విగ్రహం ఖరీదు తెలిస్తే గుండె జారిపోద్ది(వీడియో)

English summary

Rashmi Gautam bumper offer to her fan. Hot anchor and actress Rashmi Gautam gave a bumper offer for her fan.