రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

Rashmi Gautam injured Rajeev Kanakala in Charuseela

10:41 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Rashmi Gautam injured Rajeev Kanakala in Charuseela

మొదట హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించిన రష్మీ అందులో సక్సెస్ కాకపోవడంతో, 'జబర్‌దస్త్‌' కామెడీ షోలో యాంకర్ గా మన ముందుకు వచ్చి తన హాట్ హాట్ అందాలతో మనల్ని అలరించింది. ఆ తరువాత 'గుంటూరు టాకీస్‌' చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాసం దక్కించుకుంది. ఆ చిత్రంలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసి కుర్రకారు మతులు పోగొట్టింది. మళ్లీ ఇప్పుడు 'చారుశీల' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌లో రాజీవ్‌కనకాల పై రష్మీ దాడి చేసిందట.

ఈ విషయాన్ని రాజీవ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'చారుశీల షూటింగ్‌లో రష్మీ నా పై దాడి చేసింది. ఏమిటి రష్మీజీ ఇది. ఎవరైనా అడగండి ఏంటీ పని' అంటూ రాజీవ్‌ పోస్ట్‌ చేశారు.

English summary

Rashmi Gautam injured Rajeev Kanakala in Charuseela. Hot anchor and heroine Rashmi Gautam injured Rajeev kanakala in Charuseela movie.