రేప్‌లు జరగడానికి నేను కారణం అంటున్నారు

Rashmi is the reason for rapes

01:35 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Rashmi is the reason for rapes

మొదట హీరోయిన్‌గా నటించి సరైన గుర్తింపు రాక ఆ తరువాత 'జబర్ధస్త్‌' కామెడీ షోలో కురచ దుస్తులతో హాట్‌ హాట్‌ లుక్స్‌తో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది రష్మీ. దీనితో ఈ హాట్‌ బ్యూటీకి అభిమానులు బానే పెరిగారు. ఈ పాపులారిటీతోనే ఈ అమ్మడుకి మరోసారి హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. 'చందమామ కధలు' చిత్రంతో జాతీయ అవార్డు దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో 'గుంటూరు టాకీస్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఈ అమ్మడుని వరించింది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు విడుదల చేసిన గుంటూర్‌ టాకీస్‌ పోస్టర్స్‌, టీజర్స్‌, ట్రైలర్‌ చూస్తే రష్మీ ఇందులో ఎంత హాట్‌గా రెచ్చిపోయిందో అందరికీ అర్ధమయింది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలకు ముందు ఒక టీవీ ఛానల్‌ 'టాకో మానియా' అనే ప్రోగ్రామ్‌కి రష్మీని ఇంటర్‌వ్యూ చెయ్యడానికి పిలిచారు. ఈ ఇంటర్‌వ్యూ లో భాగంగా ఆ యాంకర్‌ లోకంలో రేప్‌లు జరగడానికి మీ లాంటి అమ్మాయిలే కారణం అని అప్పట్లో అన్నారు కదా దాని పై మీ స్పందనేంటి అని అడగగా రష్మీ ఘాటుగానే సమాధానమిచ్చింది. అదేంటో రష్మీ మాటల్లోనే.... ముందు జనాల మైండ్‌ సెట్‌ మారాలి. లోకంలో నేనొక్కదాన్నే అటువంటి కురచ దుస్తులు వేసుకోవడం లేదు కదా ఎంతో మంది వేసుకుంటున్నారు. నన్ను మాత్రమే వేలెత్తి చూపించి మాట్లాడడం సబబు కాదు.

అంతే కాదు రేప్‌ అనే పదం ప్రస్తుత కాలంలో ఏదో ఒక ఊత పదంలా వాడుతున్నారు., ప్రతీ చిన్న విషయానికి రేప్‌ అనే భారమైన పదాన్ని పెట్టి అనకూడదు అని చెప్పింది. ఇంకా ఏమందో ఈ వీడియోని చూసి తెలుసుకోండి.

English summary

In Talko Mania anchor asked Rashmi that you was the reason for rapes in our country. Then Rashmi reacted and said like this.