దయచేసి మా సినిమాకి వాళ్ళని తీసుకురావద్దు

Rashmi Says That Don't Bring Children To Guntur Talkies

03:07 PM ON 4th March, 2016 By Mirchi Vilas

Rashmi Says That Don't Bring Children To Guntur Talkies

హాట్‌ యాంకర్‌ రష్మీ హీరోయిన్‌గా మారి నటించిన తాజా చిత్రం 'గుంటూర్‌ టాకీస్‌'. 'చందమామ కధలు' చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో ఇంకా శ్రద్ధాదాస్‌, మంచు లక్ష్మీప్రసన్న, నరేష్‌, సిద్ధూ జొన్నలగడ్డ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ రోజు (మార్చి 4) ప్రేక్షకుల ముందుకు రానుండడంతో రష్మీ ఒక షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అదేంటంటే స్వతహాగా తమ సినిమాలు ప్రమోట్‌ చేసుకోవడానికి ఇందులో కధ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడూ చూడనటివంటి కధ ఇది. అది ఇది అని చెప్పి మొత్తం మీద సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేసేస్తారు. కానీ రష్మీ మాత్రం అందుకు భిన్నంగా మా సినిమాకి చిన్న పిల్లల్ని తీసుకు రావొద్దంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. అంతేకాదు వీలైతే ఫ్యామిలీతో రావొద్దని కూడా చెప్పింది. ఎందుకంటే కధ డిమాండ్‌ మేరకు తన అందాల్ని ఇందులో విచ్చలవిడిగా పరిచానని, ఘాటెక్కించే సన్నివేశాలు చాలానే ఉన్నాయని అందుకే పిల్లల్ని తీసుకు రావొద్దని చెప్తున్నా అంటుంది. ఒకవేళ పిల్లల్ని తీసుకువచ్చినా నా సన్నివేశాలు చూసి నన్ను తిట్టుకోవద్దని రష్మీ ఖరాఖండీగా చెప్పేసింది. దీని బట్టి చూస్తే రష్మీ ఇందులో ఏవిధంగా రెచ్చిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రిలీజైన టీజర్లు, ట్రైలర్లు కేవలం ట్రైల్‌ మాత్రమే అంతకు మించి అందాలు సినిమాలో చూడబోతున్నామని అర్ధమవుతుంది.

English summary

Jabardasth Fame Anchor Rashmi was recently acted in Guntur Talkies movie.In that movie she acted very hot and this movie was released today.today. Rashmi advised to parents to not to bring children to Guntur Talkies Movie.