ఫస్ట్‌క్రైలో రతన్‌టాటా ఇన్వెస్ట్మెంట్

Rathan Tata Invests In FirstCry

11:00 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Rathan Tata Invests In FirstCry

దిగ్గజ వ్యాపారవేత్త రతన్‌టాటా చిన్నారుల సంరక్షణ ఉత్పత్తులు విక్రయించే ఈ-కామర్స్‌ వెబ్ సైట్ ఫస్ట్‌క్రైలో పెట్టుబడి పెట్టారు. రతన్‌టాటా ఇటీవల పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌క్రై.కామ్‌కు చెందిన బ్రైన్‌బీస్‌ సొల్యూషన్స్‌లో రతన్‌ టాటా పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందీ కంపెనీ వెల్లడించలేదు. 2010లో ప్రారంభమైన ఫస్ట్‌క్రైకి ఆన్‌లైన్‌తో పాటు దేశంలోని వంద నగరాల్లో 150 దాకా ఆఫ్‌లైన్‌ స్టోర్లు ఉన్నాయి. దాదాపు 2 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. వీటి ద్వారా చిన్నారుల సంరక్షణకు పనికొచ్చే వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

English summary

Rathan Tata 's Tata Company to invest in Popular children e-commerce website Firstcry.com. This firstcry.com was owned by Brain Free Solutions.