8న పట్టాలెక్కనున్న రత్నాచల్‌

Ratnachal Express To Restart On 8th

12:51 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Ratnachal Express To Restart On 8th

ఎట్టకేలకు రత్నాచల్ సిద్దమవుతోంది. జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించిన విషయం తెలిసిందే. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 8న పట్టా లెక్కనుంది. రెండు రోజుల్లో పునరుద్ధరించాలని భావించిన కుదరలేదు. దీంతో మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. అయినా పట్టాల పైకి రప్పించలేక పోయారు. ఇక ఇప్పుడు రెండు రోజుల సమయం తీసుకుని, మరీ పగడ్భందీగా రత్నాచల్ ని పట్టాలెక్కించ డానికి ఏర్పాట్లు చేసారు. 17 బోగీలతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్‌కార్‌ బోగీలు, 8 సెకండ్‌ సిట్టింగ్‌, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విజయవాడ - విశాఖ మధ్య ఎంతోమంది ప్రయాణికులకు అనువుగా ఉంటున్న రత్నాచల్ ప్రస్తుతం తిరగకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

English summary

Ratnachal Express, the mostly choosed medium of transport between Vijayawada and Visakhapatnam, will start its journey again from February 8th, with a revised composition of comprising 17 coaches, which consists of two air-conditioned chair cars, eight second class sitting coaches, four general second class coaches, two second luggage–cum–break van coaches, and a pantry car.