నేటి నుంచి రత్నాచల్ ....

Ratnachal Express To Start Today

10:51 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Ratnachal Express To Start Today

విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సోమవారం నుంచి యథావిధిగా నడుస్తుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేసారు. కాపుగర్జన నేపధ్యంలో తునిలో ఆందోళనకారుల విధ్వంసంలో రైలు మొత్తం తగలబడిపోవడంతో దీన్ని నిలిపివేశారు. అయితే బోగీల కొరత కారణంగా ప్రస్తుతం 17 బోగీలతోనే ఇప్పుడు రత్నాచల్ నడవనుంది. . ఇందులో 8 రిజర్డ్వ్‌, 4 సాధారణ, 2 ఏసీ చైర్‌కార్లు, ప్యాంట్రీకార్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు ఉంటాయి. మరికొద్ది రోజుల్లోనే మిగతా బోగీలు(మొత్తం 24) కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితం విజయవాడ చేరుకున్న ఈ రైలు బోగీలను అధికారులు, సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. వారం రోజుల తర్వాత పట్టాలెక్కుతోంది.

English summary

Previously due to protest in Tuni some of the Protesters has burned Ratnachal Express train in Tuni.This train was restarted today with 17 Coaches. This trail run was done sucessfully in Vijayawada