అద్భుతం: పాటలు పాడుతున్న ఎలుకలు!

Rats are singing

04:32 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Rats are singing

ప్రపంచంలో మనకు తెలీని ఎన్నో విడ్డూరాలు జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఎలుకలు కూడా పడతాయట. పైగా ప్రేమ గీతాలు పాడతాయట. సూపర్ సోనిక్ జెట్ ఇంజిన్లు విడుదల చేసే శబ్ధాల మాదిరిగా ఉంటాయట. అయితే ఈ పాటలు మనకు వినపడవట. తమ పరిసరాల్లోని మిగతా ఎలుకలను ఆకర్షించేందుకే ఇవి పాడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు ఈ శబ్ధాలను జెట్ ఇంజిన్లలో ఉపయోగించే యంత్రాల సాయంతో వారు చేయగలిగారు. బ్రిటన్ లోని కేంబ్రిడ్జి, అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీల శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ పరిశోధన సాగింది.

మనషుల్లో భావవ్యక్తీకరణ లోపాలను విశ్లేషించేందుకు.. శబ్ధాలు చేసే ఎలుకల్లాంటి చిన్న జీవులపై తరచూ శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేపడుతుంటారు. తాజా పరిశోధనతో నత్తి లాంటి రుగ్మతలపై లోతైన విశ్లేషణకు మార్గం సుగమమైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఏలీనా మార్ట్ చెప్పారు. గబ్బిలాలు కూడా ఇలాంటి పాటలు పాడే అవకాశముందని ఆమె వివరించారు. ఇక ఇంట్లో ఎలుకలు తిరిగితే, పాటలే పాటలేమో!

ఇది కూడా చదవండి: బాలికలకు బ్లూఫిలిమ్స్ చూపించి లైంగికంగా వేధింపు... చివరకు ఏమైంది?

ఇది కూడా చదవండి: ఆమె అందంపై కన్నేశాడు.. ఆపై ఉద్యోగం పీకించేసిందని మంచానికి కట్టేసి..

ఇది కూడా చదవండి: అమ్మాయిలు పొద్దున్నే ఆఫీస్ కు రాగానే బాస్ కు అలా చెయ్యాల్సిందే(వీడియో)

English summary

Rats are singing. Rats are singing songs.