అడవుల్ని నరికితే ఆ ఎలుకలు పెరుగుతాయట

Rats That Live Far From Houses

11:29 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Rats That Live Far From Houses

అడవులు ఎక్కువగా ఉంటే ఎలుకలు కూడా అక్కడే ఉంటాయి. కానీ, నల్ల ఎలుకలు మాత్రం అడవులు తక్కువగా ఉండే ప్రదేశాల్లోనే నివసిస్తాయట. ఇండోనేషియాలోని బోర్నియో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ద్వీపం. ఇక్కడ నలుపు వర్ణంలో ఉండే ఎలుకలు ఎక్కుగా నివసిస్తాయి. ఇవి సాధారణంగా మురుగు కాల్వల్లోన్లూ, ఇళ్లల్లోనూ ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో వాటి సంఖ్య ఆ ప్రాంతంలో బాగా తక్కువైంది. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇవి జనావాసానికి దూరంగా అడవులు లేని ప్రదేశానికి వెళ్లిపోయాయని తేలింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల బోర్నియోలో చాలా వరకు అడవులు నేలమట్టమవుతున్నాయి. దీంతో ఎలుకలన్నీ ఆ ప్రాంతాలకు తరలివెళ్లడం శాస్త్రవేత్తలు గమనించారు. అంతే కాకుండా పడిపోయిన చెట్లకు బొరియలు చేసి వాటినే నివాసాలుగా ఏర్పరచుకున్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. వీటి జాతి వృద్ధి చెందడానికి ఇలాంటి ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎత్తుగా ఉండే చెట్ల వల్ల వీటికి రక్షణ కరవవుతుందట. అందువల్లే ఇవి గుబురుగా ఉండే మొక్కలున్న చోట ఎక్కువగా నివసిస్తాయి. ఇవి బుబోనిక్‌ ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తాయి. సుమారు 400 ఏళ్ల క్రితం ఇవి ప్రపంచ వ్యాప్తంగా జీవించి ఉండేవని శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

English summary

According to a survey Black Rats in Indonesia lives far from humans and forest.They says that this rats live in which less forest areas rather than heavy forests