రావణ గ్రామం ఎక్కడుందో.. అక్కడ దసరాకు ఏం చేస్తారో తెలుసా?

Ravana village at Baragon Meerut city

01:12 PM ON 12th October, 2016 By Mirchi Vilas

Ravana village at Baragon Meerut city

అవును ఎక్కడో శ్రీలంకలో రావణుని జ్ఞాపకాలు ఉండవచ్చు కానీ భారతదేశంలో రావణ పేరిట గ్రామం ఉండడం అంటే ఆశ్చర్యమే మరి. కానీ వుంది. అది ఎక్కడంటే యూపిలో... ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రజలు విజయదశమి పర్వదినాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకొంటున్న తరుణంలో... ఆ గ్రామం మాత్రం దసరా వేడుకలకు దూరంగా ఉంటుంది. ఎవరి ఇంట్లోనూ పండగ వాతావరణం కానరాదు. విజయదశమి రోజులను వారంతా విషాదంతో గడుపుతారు. ఆశ్చర్యంగా ఉంటుంది మరి. కానీ వారు ఎందుకలా ఉంటున్నారంటే..

1/5 Pages

బారాగాన్ అనేది ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరానికి సమీపంలో ఉన్న ఓ గ్రామం. కానీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం దానిపేరు రావణ గానే వుంది. ఈ గ్రామస్థులకు రావణుడు అంటే అమితమైన ప్రేమ. అతని తపోశక్తికి వీరు ముగ్ధులైపోతారు. ఈ గ్రామానికి రావణాసురుడితో సంబంధముందనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. రావణుడు తపోశక్తిని సంపాదించడానికి హిమాలయాలకు వెళతాడు. కఠోర తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటాడు. తపోశక్తినంతటినీ కూడ గట్టుకొని తిరిగి లంకకు ఆ గ్రామం మీదుగా పయనమవుతాడట.

English summary

Ravana village at Baragon Meerut city