ఉన్నత పదవికి రవిశాస్త్రి గుడ్ బై

Ravi Shastri says good bye to his post

06:23 PM ON 1st July, 2016 By Mirchi Vilas

Ravi Shastri says good bye to his post

గంగూలీతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భారత క్రికెట్ మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఐసీసీలోని ఉన్నత పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఇప్పటికే వ్యాఖ్యాతగా, క్రికెట్ నిపుణుడిగా, కాలమిస్ట్ గా వివిధ పాత్రలు పోషిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. దీంతో ఐసీసీ పదవికి రాజీనామా చేయాలని రవిశాస్త్రి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఆయన ఐసీసీలో మీడియా విభాగ అధికార ప్రతినిధిగా ఉన్న శాస్త్రిని, భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూ చేసిన బృందంలో గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో గంగూలీ-రవిశాస్త్రిల మధ్య మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగిన నేపథ్యంలో శాస్త్రి రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. నేను ఇప్పటికే ఐసీసీకి రాజీనామా సమర్పించా. ఆరేళ్ల నుంచి నేను ఆ పదవిలో కొనసాగుతున్నా. రాజీనామా పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం అని రవిశాస్త్రి స్పష్టం చేశారు. మొత్తానికి రవిశాస్త్రి రాజీనామాతో సరికొత్త చర్చకు తెరలేచింది.

English summary

Ravi Shastri says good bye to his post