రిచర్డ్స్ ను తలపిస్తోన్న కోహ్లి: రవిశాస్త్రి

Ravi Shastri Says Kohli Reminds Richards

11:04 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Ravi Shastri Says Kohli Reminds Richards

టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి ఆటతీరు వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌ను తలపిస్తోందని టీమిండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి చెప్పాడు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా అసాధారణ బ్యాటింగ్తో చెలరేగిపోయి రికార్డులు సృష్టించిన రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ శైలికి ప్రస్తుతం కోహ్లి ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. ఆస్ట్రేలియా టూర్ లో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో విజృంభించిన కోహ్లి ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ కూడా ఫామ్‌లోకి రావడంతో అత్యుత్తమ టాప్‌ 3 బ్యాట్స్‌మెన్లున్న టీమ్ గా భారత్‌ నిలిచిందన్నారు. ధావన్‌ తొలి ఓవర్‌ నుంచే పేసర్లపై చెలరేగిపోతే.. రోహిత్‌ శర్మ జట్టు అవసరాలకు తగినట్లు బ్యాట్‌ ఝుళిపిస్తున్నాడని చెప్పాడు.

English summary

India cricket team coach Ravi Shastri says that Virat Kohli's style of playing game reminds Cricket Legend Richards.Ravi Shastri said that Virat Kohli played very well in Australia series.