రాజమౌళి బాటలోనే రవిబాబు!!

Ravibabu directing Eega like movie

05:23 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Ravibabu directing Eega like movie

'ఈగ'నే హీరోగా తీసుకుని సూపర్‌హిట్‌ అందుకున్నాడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి బాటలోనే డైరెక్ట్‌ర్‌ రవిబాబు కూడా నడుస్తున్నట్లు ఉన్నాడు. అయితే రాజమౌళి ఒక చిన్న ఈగను తీసుకుంటే రవిబాబు ఏకంగా జంతువునే తీసుకుంటున్నాడు. ఈగ సినిమాకి డి.సురేష్‌బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించారు. రాజమౌళికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి గ్రాఫిక్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడనివ్వకుండా దీనికి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు రవిబాబు చిత్రాన్ని కూడా సురేష్‌బాబే నిర్మిస్తున్నాడు. ఈగలో ఉన్నంత గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్స్‌ ఇందులో కూడా ఉండబోతున్నాయంట.

ఈగ లాంటి క్లారిటీ గ్రాఫిక్స్‌తోనే రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. అయితే రవిబాబు తీసుకున్న ఆ జంతువేంటో ప్రస్తుతానికి సస్పెన్స్‌. వరుస పరాజయాలతో సతమవుతున్న రవిబాబుకి ఈ చిత్రంలో మళ్లీ సక్సెస్‌ అందుకోవాలని కోరుకుందాం.

English summary

Ravibabu directing Eega like movie. And it is producing D. Suresh Babu.