మాక్స్ వెల్ విధ్వంసంపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్(వీడియో)

Ravichandran Ashwin shocking comments on Glenn Maxwell

03:42 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Ravichandran Ashwin shocking comments on Glenn Maxwell

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ గత కొంత కాలంగా ఫాం కోల్పోయి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంకతో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 145 పరుగులతో విధ్వంసం సృష్టించిన సంగతి కూడా తెలిసిందే. అయితే మాక్స్ వెల్ ఇన్సింగ్స్ పై స్పందిస్తూ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ఈ ఇన్నింగ్స్ పై చేసిన ట్వీట్ పై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. నాలుగు ఓవర్ల బౌలింగ్ పవర్ ప్లేలో రెండు ఓవర్లను టెన్నిస్ బంతితో బౌలింగ్ చేయాలని, మరో రెండు ఓవర్లను బౌలర్ ఆపరేట్ చేసే బౌలింగ్ మేషిన్ తో వేయాలని అశ్విన్ రీట్వీట్ చేశాడు. బౌలింగ్ మేషిన్ తో మాత్రమే మాక్స్ వెల్ కు బౌలింగ్ చేయగలమని అశ్విన్ తన పోస్ట్ లో అభిప్రాయపడ్డాడు.

కాగా, అంతకుముందు హర్షాబోగ్లే ఆసీస్ ఇన్నింగ్స్ పై ఈ విధంగా ట్వీట్ చేశాడు.. '10 ఓవర్లలో 153 పరుగులు.. అది కూడా 39 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యం.. మాక్స్ వెల్ 145 నాటౌట్(65బంతులు)... 263 స్ట్రైక్ రేట్ తో(18 బంతుల్లో 45 పరుగులు) చేశాడు. తర్వాత ఏంటి? ఇంకేవరైనా బౌలర్ సిద్ధంగా ఉన్నారా?' అని సవాల్ విసిరాడు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 49 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్ వెల్(65 బంతుల్లో 145 నాటౌట్: 14 ఫోర్లు, 9 సిక్సర్లు) వీర బాదుడుకు లంక బౌలర్లు బెంబేలెత్తిపోయారు. దీంతో టీ20ల్లో గతం(2007)లో లంక పేరిట ఉన్న రికార్డు(కెన్యాపై 260 పరుగులు)ను తిరగరాస్తూ 20 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి ఆసీస్ జట్టు 263 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి: ధోని మేనేజర్ తో కలిసి సాక్షి ఇలా..

ఇది కూడా చదవండి: రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు!

ఇది కూడా చదవండి: హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఇలా మాత్రం అసలు చేయకండి!

English summary

Ravichandran Ashwin shocking comments on Glenn Maxwell. Glenn Maxwell beats 145 in 65 balls against Srilanka