నా పెళ్ళికి ధోనీ ని, రైనా ని పిలవను

Ravindra Jadeja will not invite Dhoni and Raina for his marriage

06:10 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Ravindra Jadeja will not invite Dhoni and Raina for his marriage

భారత ఆల్ రౌండర్ సర్. రవీంద్ర జడేజా ది ఈ నెల 17వ తేదీన వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ధోనీని, సురేష్ రైనాను పిలవనని జడేజా చెప్పినట్లు సమాచారం. అయితే ఇది మనస్పర్థల కారణంగా చెప్పిన మాట కాదు, జడేజా ఓ బెంగాలీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో సరదాగా ఇలా మాట్లాడాడు. రైనా, ధోనీ నాకు ఎంతో ఆప్త మిత్రులు, వాళ్ళని నేను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు.. నేను పిలవకపోయినా ధోనీ, రైనా నా పెళ్లికి తప్పకుండా వస్తారని జడేజా తెలియజేసాడు. జడేజాకు, మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకితో ఫిబ్రవరి మొదటి వారంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే పెళ్ళికి ముందే జడేజాకు కాబోయే మావయ్య 96 లక్షల విలువైన ఆడీ క్యూ 7 కారును గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: జడేజా కి పెళ్లి కి ముందే ఆడీ కారు గిఫ్ట్

ఇది కూడా చదవండి: సర్దార్ పై బెట్టింగ్.. ఆంధ్రా, తెలంగాణా లో నగ్నంగా పరిగెడతా

English summary

Ravindra Jadeja will not invite Dhoni and Raina for his marriage. Indian cricket all rounder Jadeja told that I will not invite Dhoni and Raina for my marriage.