టూర్ లోనూ గుర్రంతోనే ... జడేజా

Ravindra Jadeja With Horse On West Indies Tour

11:23 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Ravindra Jadeja With Horse On West Indies Tour

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా గుర్రాలంటే పడిచస్తాడని అంటారు. అందుకేనేమో వెస్టిండీస్ టూర్ లోనూ తన అభిరుచిని చాటుకున్నాడు. ఇండియన్ టీం బస చేసిన హోటల్ కు సమీపంలోకి వచ్చిన గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడు. గుర్రం ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా ఉందని చెబుతూ ఫొటోను జడేజా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. గుర్రాలను మచ్చిక చేసుకోవడం, స్వారీ చేయడం రవీంద్ర జడేజాకు క్రికెట్ తర్వాత అత్యంత ఇష్టమైన అంశం. అందుకే రవీంద్ర జడేజా ట్విటర్ అకౌంట్ నిండా గుర్రాలే కనపడతాయి.

English summary

Indian Team All rounder Ravindra Jadeja was a lover of horses and recently Indian Team wnt to West Indies tour to play test matches and ODI's. Jadeja found a horse on the farm near by his hotel and he went there and taken a photo and kept it in his Facebook account.