పూరీ 'ఆటో జానీ' లో రవితేజ

Raviteja as Auto Johnny

02:18 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Raviteja as Auto Johnny

పూరీజగన్నాధ్‌ ఆటోజానీ సినిమాను కొన్ని కారణాల వల్ల మెగాస్టార్‌ చిరంజీవి నిరాకరించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే దీంతో పూరీజగన్నాధ్‌ ఈ సినిమా తియ్యడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ కోసం పూరీ వేరే దారిని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో రవితేజని హీరోగా పూరీ అనుకుంటున్నాడట. రవితేజ బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్టుగా ఈ కధలో మార్పులు చేర్పులు చేశాడట. కధలో అన్నీ సవరణలూ చేసిన తరువాత ఈ కధని రవితేజ కి చెప్పాడని సమాచారం. ఈ సినిమాకి రవితేజ కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా ఒక పూర్తి మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట.

ఈ సినిమాలో రవితేజ ఒక కొత్త యాంగిల్‌ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. రవితేజ, పూరీజగన్నాధ్‌ కాంబినేషన్‌లో వచ్చే ఆరవ సినిమా ఇది.

English summary

Megastar Chirajeevi rejected movie Auto Johnny. Puri Jagannadh want to direct this film with Chiru but Chirajeevi don't like this story. But now in this movie Raviteja want to act as a hero. This is the perfect story for raviteja body language.