రవితేజ కొత్త సినిమా ఆగిపోయింది

Raviteja new film shooting were stopped

12:44 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Raviteja new film shooting were stopped

మాస్‌ మహారాజ్‌ రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' సినిమాతో మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఇంకో సినిమా ఏదీ మొదలు పెట్టలేదు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా ఒక సినిమా త్వరలోనే మొదలుపెడదాం అనుకున్నారు. ఈ సినిమాను లాంఛనంగా లాంచ్‌ చేశారు. ఈ సినిమా డిసెంబర్‌ లోనే సెట్స్ పైకి వెళ్ళాలి, కానీ ఈ సినిమా ఇంకా మొదలవ్వలేదు. ప్రొడక్షన్‌ టీమ్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఆపేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ లెక్చరర్‌ పాత్రలో కనిపించసున్నాడు. అనుపమ పరమేశ్వరన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌లు గా ఎంపికయ్యారు. ఈ సినిమా సడెన్‌ గా ఆగిపోయింది. అయితే అన్ని అడ్డంకులూ తొలగించుకుని మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.

English summary

Raviteja new film shooting were stopped. This movie is producing by Dil Raju. Anupama Parameswaran and Pragya Jaiswal want to romance with Raviteja in this film.