స్వామిరారా డైరెక్టర్తో రవితేజ!!

Raviteja next film with Swamy Raara Director

07:05 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Raviteja next film with Swamy Raara Director

స్వామిరారా అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్తో వాచ్‌గ్చిన దర్శకుడు సుధీర్ వర్మ. ఇది మంచి హిట్. మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం 'బెంగాల్ టైగర్'. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించబోతున్నాడని ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తెర దించుతూ ఇప్పుడు తాజా సమాచారం అందింది. రవితేజ ప్రస్తుతం దిల్రాజు నిర్మాణంలో ఎవడో ఒకడు చిత్రంలో నటిస్తున్నాడు. ఇది అయిపోయాక సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తాడని సమాచారం. సుధీర్ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అయితే ఇది రవితేజ చేసే రొటీన్ మాస్ యాక్షన్ కథ కాదంట ఒక డిఫరెంట్ క్యారెక్ట్రైజేషన్లో రవితేజ కనిపించబోతున్నాడట. పచ్చిగా చెప్పాలంటే ఒక వింత రవితేజని ఇందులో చూడబోతున్నామని సమాచారం. సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామిరారా, దోచేయ్ స్టైలిష్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. ఇప్పుడు ఇది కూడా ఆ కోవలోకి చెందినదే కాబట్టి రవితేజ అంగీకరించాడని చెప్పుకుంటున్నారు.

English summary

Raviteja next film with Swamy Raara Director. Raviteja now acting in Yevado Okadu in Dil raju producing. After completion of this project he will goto sudheer varma project.