ట్రంప్ విజయంలో తెలుగోడి కీలక పాత్ర!

Ravulapalem man behind Trump success

04:21 PM ON 10th November, 2016 By Mirchi Vilas

Ravulapalem man behind Trump success

భారతీయులు ఎందులోనూ తీసిపోరు. అందునా తెలుగువాడు ఎందులోనూ తక్కువ కాదు. ఇప్పడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనుక కూడా మన తెలుగోడి కీలక భూమిక వుంది. అందుకే, ట్రంప్ గెలుపొందడంతో ముమ్మిడివరప్పాడులో సంబరాలు జరుపుకున్నారు. కారణం ఏమిటిటంటే, రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడుకు చెందిన ఇరగవరపు తమ్మిరాజు మనుమడు అవినాష్ కొంతకాలంగా ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న తన భార్య రంజనను కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఆరిజోనా గవర్నర్ పదవికోసం జరుగుతున్న ఎన్నికలను నిశితంగా పరిశీలించారు.

1/4 Pages

గవర్నర్ పదవికి పోటీపడుతున్న జూసీకి గెలుపు వ్యూహాల గురించి ఈ-మెయిల్స్ పంపుతుండేవారు. అవినాష్ మేథాశక్తిని గుర్తించిన రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ప్రచార వ్యూహబృందంలో అవినాష్ కు చోటుకల్పించింది. మొదట్లో రిపబ్లికన్ పార్టీకి డేటా ఎనలిస్ట్ గా, తదనంతరం రాజకీయ పరిశీలకుడిగా విధులు నిర్వహించేవారు.

English summary

Ravulapalem man behind Trump success