ప్రేమికుల రోజున రాయలసీమ చైతన్య యాత్ర

Rayalaseema Chaitanya Yatra Starts On 14th February

09:36 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Rayalaseema Chaitanya Yatra Starts On 14th February

ఇదేమిటి అనుకుంటున్నారా అయితే ఓ సారి చదవాల్సిందేగా... ఇప్పటికే చంద్రబాబు సర్కార్ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందన్న విమర్శలు వస్తుంటే, తాజగా రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కర్నూలులో జరిగిన రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యక్రమంలో 'ఏపీ సీఎం చంద్రబాబు నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రాయలసీమను మొత్తం లూటీ చేస్తున్నారు' అని ధ్వజమెత్తారు. అక్కడితో ఆగలేదు, 'చంద్రబాబు ఇప్పటివరకు రాయలసీమకు ఏమీ చేయలేదు. పైగా తమ సంపదను తీర ప్రాంతాలకు తరలిస్తున్నారు , సీమలోని విలువైన ఖనిజ సంపదను అమరావతి కోసం ఖర్చు చేస్తున్నారు' అని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రాయలసీమ బాగుపడాలంటే ప్రత్యేక రాయలసీమ ఒక్కటే అసలైన పరిష్కారమని తేల్చారు. అందుకే ఫిబ్రవరి 14 నుంచి కర్నూలు జిల్లాలోని మహాయోగీ లక్ష్మవ్వ స్వగ్రామం మూసపల్లి నుంచి రాయలసీమ చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నట్లు బైరెడ్డి వెల్లడించారు. మరి ఆరోజు ప్రేమికుల రోజే కదా...

English summary

Rayalaseema activists have announced to launch Rayalaseema Chaitanya Yatra tour across the four Rayalaseema districts to create awareness among the public on the injustice meted out to the region before and after the bifurcation of united AP.