కొత్త 500 నోట్ల కొరతపై వాస్తవం చెప్పిన ఆర్బిఐ

RBI About Scarcity Of 500 Notes

12:40 PM ON 28th November, 2016 By Mirchi Vilas

RBI About Scarcity Of 500 Notes

పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో జనం కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. అయినా ప్రజలకు సరిపడ నోట్లను అందించలేక పోవడంతో ఆర్బీఐపై ప్రజలు మండిపడుతున్నారు. 2వేల నోట్లన్నా కొన్నిచోట్ల దొరుకుతున్నాయి కానీ 5వందల నోటు జాడే లేదని సామాన్యులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అయితే 5వందల నోట్ల కొరత విషయంలో తప్పు తమది కాదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు.

వాస్తవానికి 2వేల నోట్లను ఆర్బీఐ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేస్తున్నామని, 5వందల నోట్లు మాత్రం ప్రభుత్వ పరిధిలోని నాసిక్, దేవాస్ లోని ప్రింటింగ్ ప్రెస్ లు ముద్రిస్తున్నాయని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. 5వందల నోటు ముద్రణ తమ పరిధిలో లేదని, అలాంటప్పడు తమపై విమర్శలు ఎలా చేస్తారని ఆర్బీఐ అధికారులు ప్రశ్నించడం విశేషం.

అన్ని రకాల నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, ఆర్థిక శాక నోటిఫికేషన్స్ ను అమలు చేయడం మాత్రమే ఆర్బీఐ పరిధిలో ఉందని ఆర్బీఐ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:బీజేపీ సర్కార్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి:దేశంలో ఒక్క శాతం మంది దగ్గర 60 శాతం సంపద ... సర్వేలో షాకింగ్ విషయాలు

English summary

Reserve Bank Of India officials were responded to the scarcity of 500 notes and they said that 500 rupees notes printing was not under their control and they said that the printing of 500 rupees notes was under the control of Central Government.