రూ 10 నాణెం చెల్లుబాటుపై ఆర్ బి ఐ ఏమందంటే ...

RBI gave clarity on Rs 10 coin

11:32 AM ON 8th February, 2017 By Mirchi Vilas

RBI gave clarity on Rs 10 coin

రూ 500,రూ 1000 నోట్ల రద్దు నేపథ్యంలో ఇంకా మరికొన్ని నోట్లు, నాణాలు రద్దవుతాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పది రూపాయల నాణెం గురించి రకరకాల పుకార్లు వస్తున్నాయి. దీంతో సహజంగానే జనంలో అలజడి మొదలైంది. ముఖ్యంగా రూ.10 నాణెం చట్టబద్ధత గురించి వర్తకులు, దుకాణదారులు, సాధారణ ప్రజానీకంలో ఆందోళనలు రేపిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల రూ 10 నాణేలను తిరస్కరిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. ఈనేపధ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరణ ఇచ్చింది. ''భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన రూ.10 నాణెంలను రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెస్తోంది. ఈ నాణెంలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడం కోసం, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించేలా కొత్త డిజైన్, కొత్త డినామినేషన్ లలో నాణెంలను తరచుగా ప్రవేశపెడుతుంటాం. ఎక్కువ కాలం ఇవి చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయంలో వివిధ డిజైన్లు, వివిధ ఆకృతులు కలిగిన నాణెంలు చలామణిలో ఉండొచ్చు. జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి ఒక మార్పే. కొత్త రూ.10 నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటుంది. పాత రూ. 10 నాణెంలు రూపాయి గుర్తు కలిగి ఉండవు. కానీ ఈ రెండు రకాల నాణెంలు చట్టబద్దమైనవే, లావాదేవీలకు అర్హమైనవే'' అని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ప్రకాశించే చర్మం కోసం పండ్ల పాక్స్

ఇది కూడా చూడండి: జుట్టు బాగా పెరగటానికి ఒక రెసిపి

English summary

RBI gave full clarity on Rs 10 coin that public can continue to accept 10 rupee coin as legal tender.