షాకింగ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంకు అధికారి అరెస్ట్

RBI Officer Arrested For Illegal Note Exchange

11:18 AM ON 14th December, 2016 By Mirchi Vilas

RBI Officer Arrested For Illegal Note Exchange

నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇచ్చిన వెసులుబాటుని అక్రమ మార్గం పట్టించి చేతివాటం ప్రదర్శించిన అధికారుల దారుణాలు ఒక్కొక్కయిట్ వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు బ్యాంకు అధికారులు, పోస్టల్ అధికారులు ఈ జాబితాలో ఉండగా, ఫస్ట్ టైమ్ రిజర్వ్ బ్యాంకు అధికారిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. బెంగుళూరులో ఆర్బీఐ బ్రాంచ్ లో స్పెషల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మైకేల్ అరెస్టుతో కలకలం రేగింది. అక్రమంగా రూ. 1.50 కోట్ల పాత నోట్లను కొత్త కరెన్సీగా మారుస్తున్న సమయంలో 9 మందిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అందులో మైకేల్ కూడా వున్నాడు. వీళ్లంతా 15 నుంచి 30శాతం కమీషన్ కోసం పాత నోట్లను కొత్త నోట్లుగా మారుస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఎనిమిది మందిలో ఓ వ్యక్తి.. ప్రభుత్వ ఉద్యోగికి బంధువని సమాచారం. ఐతే, ఆ ఉద్యోగి ఎవరు అనే విషయం తెలియాల్సివుంది.

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

English summary

RBI Officer Arrested For Illegal Note Exchange.