రెండు రకాల కొత్త వెయ్యి నోట్లు!

RBI To Launch New 1000 Rupee Notes In Two Different Colors

10:44 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

RBI To Launch New 1000 Rupee Notes In Two Different Colors

రూ 500, రూ 1000 పెద్దనోట్ల రద్దుకు ముందు కొత్త రూ.2వేల నోటు ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలు హల్ చల్ చేశాయి. నోట్ల రద్దు అనంతరం అటువంటి నోటునే ఆర్ బీఐ విడుదలచేసింది. తాజాగా రెండు కొత్త రంగుల్లో రూ.వెయ్యి నోటు రాబోతోందంటూ ఆన్ లైన్ లో చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సర కానుకగా దీన్ని ఆర్ బీఐ తీసుకురానుందంటూ ప్రచారం వూపందుకుంది. ఈ కొత్తనోట్లు బూడిద, ఆకుపచ్చ రంగులో ఉండనున్నాయంటూ సంబంధిత చిత్రాలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

నోట్ల రద్దు అంశంపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. కొత్త రూ.వెయ్యి నోటు తీసుకురానున్నామని తెలిపారు. విభిన్న రంగు, కొత్త డిజైన్ తో దీన్ని విడుదల చేస్తామని, దానికి కొంతసమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు తాజా వూహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమన్నది తెలుసుకోవాలంటే మరికొంత సమయం వెయిట్ చేయక తప్పదు.

English summary

Indian Government has banned old 500 and 1000 rupee currency notes and they bought new 500 and 2000 rupee currency notes. Now a news came to know that RBI was planning to bring new 1000 rupee currency notes in two different colors. Now this news become viral all over the internet.