కొత్తగా రూ 100 నోట్లు ... మరి పాతవాటి సంగతేంటి?

RBI To Release News 100 Rupees Currency Notes

11:28 AM ON 7th December, 2016 By Mirchi Vilas

RBI To Release News 100 Rupees Currency Notes

రూ 500 ,రూ 1000 నోట్ల రద్దు తర్వాత చిల్లర కొరత ఏర్పడడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల దగ్గర, ఏటీఎం ల దగ్గర జనం పడిగాపులు గాస్తున్నారు. అయితే రిజర్వు బ్యాంకు దఫదఫాలుగా పలు నిర్ణయాలు వెల్లడిస్తోంది. రూ 20 , రూ 50 నోట్లు కొత్తవి తెస్తున్నట్లు ప్రకటించి, పాతవి యధావిధిగా చెల్లుబాటు అవుతాయని చెప్పింది. నేడు మరో కీలక ప్రకటన చేసింది. అతి త్వరలో కొత్త రూ.100 నోట్లను విడుదల చేయనున్నట్టు పేర్కొంది. కొత్త నోట్లలో ఇరువైపులా ఉన్న నంబరు ప్యానల్స్ లో ఇన్ సెట్ లెటర్ ఉండదని తెలిపింది. పాత వంద రూపాయల నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:జయలలిత గురించి మనకు తెలీని నిజాలు!

ఇవి కూడా చదవండి:రోబో 2.0 రిలీజయ్యే థియేటర్లు ఎన్నో తెలిస్తే మైండ్ బ్లాకే!

English summary

Recently Government of India was cancelled Old 500 Rs and 1000 Rs Notes and released new 500 and 2000 Rupees Currency Notes. Due to the lack of New Currency Notes People of India were struggling and recently Reserve Bank Of India (RBI) announced that they were going to launch new 100 Rupees Currency Notes and they also said that the old 100 Rupees Currency Notes were also will be Valid.