'జియో'ను తలదన్నేలా బంపరాఫర్ ప్రకటించిన 'ఆర్కామ్'!

Rcom giving shock to Jio

01:16 PM ON 23rd November, 2016 By Mirchi Vilas

Rcom giving shock to Jio

వ్యాపారంలో పోటీ ఉంటేనే కదా మజా. పైగా అంబానీ సోదరుల మధ్య పోటీ అంటే నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమంటే, వెల్ కమ్ ఆఫర్ తో దేశంలోని టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియోకు అనిల్ సారథ్యంలోని ఆర్కామ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈవిధంగా అన్న ముఖేశ్ అంబానీ జియోకు తమ్ముడు అనిల్ అంబానీ షాకిచ్చారు. మొత్తం మొబైల్ వినియోగదారులను తనవైపు తిప్పుకునేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

1/4 Pages

కేవలం రూ.149 రీచార్జ్ తో దేశవ్యాప్తంగా అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చంటూ మంగళవారం బంపరాఫర్ ప్రకటించింది. అంతేకాక ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని, 2జీ, 3జీ, 4జీ వినియోగదారులంతా ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని వివరించింది. తాజా ఆఫర్ ఇంచుమించు జియోను పోలి ఉందని చెప్పొచ్చు.

English summary

Rcom giving shock to Jio