చేతబడి గురించి భయంకర నిజాలు

Real facts about Chetabadi

10:42 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Real facts about Chetabadi

ఈ ఆధునిక సాంకేతిక యుగంలో సైతం కొన్ని చేష్టలు, నమ్మకాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చేతబడి గురించి వినే వార్తలు, చూసే సంఘటనలు దారుణంగా ఉంటున్నాయి. అసలు చేతబడి ఏంటి? దీని ప్రభావం ఎంత? వంటి విషయాలను ప్రస్తావిస్తే, ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతారు. ఎదుటి వ్యక్తి జీవిత కాలాన్ని కూడా ఈ చేతబడి ప్రభావితం చేస్తుందా? కొందరు చేతబడి చేస్తుంటారు. కొందరు చేతబడికి గురవుతుంటారని ప్రజల్లో బలంగా నమ్మకం. ఇవన్నీ నమ్మొచ్చా? నిజంగానే చేతబడి ఫలిస్తుందా? అసలు చేతబడితో ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చెయ్యొచ్చా? ఇవన్నీ నేటి తరం యువతును వేధిస్తున్న ప్రశ్నలు.

చేతబడి అనేది పాత తరంలో బాగా నమ్మేవారు. అమ్మమ్మలు తాతయ్యలు దీని గురించి ఎక్కువగా చెప్పుకొనేవారు. ఆ కాలంలో ఇది ఎక్కువగా ఉండేది అనే వారు. చేతబడి చేసే వారిని దానికి గురైన వారిని చూసామని చెబుతుంటారు. అయితే టెక్నాలజీ ఇంత అభివృద్ది చెందాక కూడా చేతబడి ఏంటి అంటూ హేతువాదులు కొట్టిపారేస్తుంటారు. కానీ ఈ తరహా సినిమాలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. చేతబడి గురించి మరికొన్ని విషయాలు మీకోసం..

1/4 Pages

1. చేతబడి:

చేతబడి అనేది ఒట్టి మూఢ నమ్మకం అని కొట్టిపారేసే హేతువాదులున్నారు. అలాగే ఇది ఖచ్చితంగా జరుగుతుందని దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నమ్మే వారు ఉన్నారు. ఈ నమ్మకంతో భయాందోళనలకు గురవుతుంటారు.

English summary

Real facts about Chetabadi