గడపపై కూర్చోకూడదని ఎందుకు అంటారో తెలుసా?

Real facts behind Gadapa

12:41 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Real facts behind Gadapa

ఇంట్లో పిల్లలు అలా వచ్చి ఇలా వచ్చి చటుక్కున గడపమీద కూర్చుండిపోతుంటారు. అయితే గడపపై కూర్చోవద్దని పెద్దలు అంటారు. ఒకవేళ ఇలా కూర్చున్నా, కేకలేసి లేపేస్తారు. అయితే ఇది ఓ మూడనమ్మకంగా గత కొద్దికాలం వరకు భావింపబడేది. డ్రౌసింగ్ రాడ్ ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది. డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేం వద్ద ఉంచిన, అక్కడ ప్రతికూలశక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ణ్జానవంతులైన మన పూర్వీకులకు ఈ విషయం ముందుగానే తెలుసుకాబట్టి, ఇలాంటి నిషేధం పెట్టారు. కాబట్టే తలుపు ఫ్రేం వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు.

అలా నిషేధించడానికి, తలుపు ఫ్రేం వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేధం వెనుక రహస్యం. ఇలా తలుపు ఫ్రేం నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండటానికి గల కారణం ఫ్రేం చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను, తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిరి నిర్మిస్తారు. మన దేవాలయాలు చర్చీలు కూడా ద్వారాల వద్ద పైభాగం వంపుగా ఆర్చీల మాదిరి నిర్మిస్తుంటారు.

English summary

Real facts behind Gadapa