వామ్మో .. దెయ్యాలున్నాయట ... ఇదిగో ఇతని కళ్ళల్లోకి చూసిందట

Real Ghost Caught On Camera

11:22 AM ON 16th December, 2016 By Mirchi Vilas

Real Ghost Caught On Camera

దెయ్యాలున్నాయా లేదా అనే దానిపై ఇంకా వాదనలు జరుగుతూనే ఉంటాయి. ఎవరి వాదన వారిది. ఎవరి క్లారిటీ వారిదే. అయితే ఓ పారానార్మల్ (ఆత్మల సంచారం) పరిశోధకుడు దెయ్యాన్ని తన కెమెరాలో బంధించడంలో విజయం సాధించాడట. దెయ్యాల మాటలను రికార్డు చేయాలన్నది కూడా అతని చిరకాల కోరిక అట. అందుకోసం అతడు ఎన్నో చోట్లకు వెళ్లాడు. అయితే, బ్రిటన్ లో కిడ్డర్ మిన్స్టర్ లోని డ్రేక్ లో సొరంగమార్గంలో అతడి కోరిక నెరవేరిందట. ఇంతకీ అతని పేరు ఏమిటంటే, అంథోనీ మార్క్ . ఇతగాడు ఈ సొరంగ మార్గంలో ఒంటరీగా రాత్రి 11.30 గంటలకు వెళ్లాడు. దెయ్యాల మాటలను రికార్డు చేయడం కోసం ఓ ఎలక్టానిక్ పరికరం, వీడియో కెమెరా వెంట తీసుకెళ్లాడు. ఎలక్టానిక్ పరికరం ఓ చేతిలో కెమెరా మరో చేతిలో పట్టుకొని అంతటా తిరిగాడు.

అనంతరం, వీడియో కెమెరాలో చూడగా సరిగ్గా తన ఎదురుగా ఓ వ్యక్తి ముఖాకారం గాలిలోంచి ఏర్పడడం రికార్డయిందని అంధోని చెబుతున్నాడు. అంతేకాదు కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. ‘‘ఏమీలేని చోట ఓ ముఖాకృతి గాలిలో ఏర్పడం, అది నా కళ్లలోకి నేరుగా చూడడం, తిరిగి అదృశ్యమవడం.. మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. దెయ్యం కనిపించినప్పడు కెమెరా ఫ్లాష్ ఆఫ్ చేశా. కానీ, ఎదురుగా నాకు ఏమీ కనిపించలేదు. వీడియో పదేపదే పరిశీలించా. కానీ, ఆ ఆకృతి ఏర్పడడానికి తార్కిక సమాధానం లభించలేదు. ఇంటర్ నెట్ లో దెయ్యాలకు సంబంధించిన నకిలీ ఫోటోలు ఎన్నో పోస్ట్ అవుతుంటాయి. కానీ, నేను తీసిన వీడియో మాత్రం వాస్తవమయినది’’ అని అంథోని చెప్పుకొచ్చాడు. రెండో ప్రపంచ యుద్ధం, శీతల యుద్ధం సమయంలో ఈ సొరంగ మార్గాన్ని యుద్ధపరికరాలు తయారు చేసేందుకు ఉపయోగించారు. ఇక్కడ జరిగిన ఓ ప్రమాదంలో కార్మికులు మృతిచెందారు. వీరంతా ఈ సొరంగంలో దెయ్యాలుగా సంచరిస్తున్నారని స్థానికులు విశ్వసిస్తారు.

ఇది కూడా చూడండి: అన్నాళ్ళు సీత తన దగ్గరున్నా.. రావణుడు సీతను ఎందుకు ముట్టుకోలేదో తెలుసా?

ఇది కూడా చూడండి: చిదంబర రహస్యం గురించి విన్నారా? ఇప్పటికీ చిదంబరంలో కొన్ని రహస్యాలు ఉన్నాయట!

ఇది కూడా చూడండి: ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్నారా? అయితే దీనితో నివారించొచ్చు..

English summary

Shocking Real Ghost Caught On Camera.