ట్రూ లవ్ అంటే ఇలా ఉండాలట.. చదివితే షాకౌతారు!

Real love story

10:50 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Real love story

అవును ఇదో ప్రేమ కథే. అనుకోకుండా కలిసిన ఓ అమ్మాయి, అబ్బాయి, మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేని ఇష్టం అట. ఆ ఇష్టమే ప్రేమగా రూపాంతరం చెందింది. అయితే ఆ యువకుడిది పేద కుటుంబం. దీంతో సహజంగానే ఆ యువతి తల్లిదండ్రులు అతన్ని అంగీకరించలేకపోయారు. కానీ కొన్ని రోజుల తరువాత ఆ యువకుడి గురించి పూర్తిగా తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు తమ కూతురికి అతనే కరెక్ట్ అని భావించి తమ కూతుర్ని అతనికే ఇచ్చి పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే విధి విచిత్రంగా ఉంటుంది కదా. అందుకే, అంతలోనే ఓ సమస్య వచ్చి పడింది.

1/8 Pages

ఆ యువకుడు అప్పటికే సైన్యంలో పనిచేస్తుండడంతో ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి ఓ రోజు ఉత్తరం వచ్చింది. యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతోంది, వెంటనే వచ్చి సైన్యంతో కలవమని ఆ ఉత్తరం సారాంశం. దేశభక్తి ఉన్న ఆ యువకుడు తన పెళ్లిని వాయిదా వేయాలని చెప్పి యుద్ధంలో పాల్గొనడానికి బయల్దేరాడు. అలా వెళ్లే సమయంలో తన ప్రేయసి అయిన ఆ యువతికి సెండ్ ఆఫ్ ఇస్తూ మోకరిల్లి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగాడు. దీనికి ఆ యువతి ఆనంద భాష్పాలు రాల్చి తప్పకుండా చేసుకుంటానని బదులిచ్చింది. అదే ఉత్సాహంతో ఆ యువకుడు యుద్ధం కోసం ముందుకు కదిలాడు.

English summary

Real love story