తండ్రి వజ్రాల వ్యాపారి.. కొడుకు బేకరీలో పనివాడు(రియల్ స్టోరీ)

Real story of Diamonds business owner

06:10 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Real story of Diamonds business owner

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'అరుణాచలం' చిత్రంలో కోటీశ్వరుడైన సీనియర్ అరుణాచలం తన కొడుకు అరుణాచలంకి 30 కోట్లు ఖర్చు పెడితే 3000 కోట్లు ఇస్తానని షరతులు పెట్టీ మరీ ఒక పందెం పెడతాడు. మొదట చిన్న అరుణాచలం ఆ పందెంకి ఒప్పుకోకపోయినా ఆ డబ్బు దుర్మార్గుల పాలు కాకూడదని ఆ పందెంకి ఒప్పుకుంటాడు. ఇది సినిమా కధ. అయితే నిజంగా ఇలాంటి కథే నిజ జీవితంలో ఒక కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి తన తనయుడికి ఇలాంటి పందెమే పెట్టాడు. ఏంటీ నమ్మడంలేదా? అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..

తన కొడుక్కి జీవితం, డబ్బు విలువ తెలియాలని.. తనకాళ్లమీద తాను నిలబడగలిగే శక్తి తన కొడుక్కి రావాలని గుజరాత్ లోని సూరత్ కు చెందిన 6 వేల కోట్ల సంపాదన కలిగిన వజ్రాల వ్యాపారి డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడువుగా ఒక్కగానొక్క కొడుకు 'ద్రవ్య దలోకియా'కు తన మనసులో మాట చెప్పాడు. అమెరికాలో ఎంబీఏ చదువుతున్న 21 ఏళ్ల ద్రవ్య హాలీడే కోసమని ఇండియా వచ్చాడు. సూటు బూటు వేసుకొని నేను సంపాదించింది అనుభవించడం కాదు... కష్టపడి డబ్బు సంపాదిస్తే అందులో వున్న విలువేమిటో తెలుస్తుంది అంటూ తండ్రి చెప్పిన మాటల్ని ఛాలెంజ్ గా తీసుకున్నాడు.

1/5 Pages

తండ్రి పెట్టిన మూడు షరతులు

1. కోటీశ్వరుడి కొడుకునని ఎక్కడా చెప్పకూడదు. అసలు నీ తండ్రి గురించి ఎక్కడా చెప్పకూడదు.

2. ఎక్కడా వారం రోజులకు మించి పని చెయ్యకూడదు.

3. అత్యవసరమైతే నేను ఇచ్చిన 7 వేల రూపాయలు ఉపయోగించకూడదు. సెల్ ఫోన్ ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు.

English summary

Real story of Diamonds business owner