చైనా వాళ్ళు కనిపెట్టిన ఈ లేడీ 'రోబో' మాట్లాడుతుంది తెలుసా?

Realistic lady robot in China

04:57 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Realistic lady robot in China

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రోబో చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రజినీకాంత్ రోబో లో అద్భుతంగా నటించారు. ఒక రోబో మాట్లాడడం, వంట వండడం, ఫైట్లు చెయ్యడం, డాన్స్ చెయ్యడం, ప్రేమించడం, సాయం చెయ్యడం వంటివి ఎన్నో ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా చూసాక నిజంగా ఇలాంటి రోబో ఉంటే ఎంతో బాగుండేది అనుకున్నారు అంతా.. ఈ సినిమా చైనా వాళ్ళు కూడా చూసి ఉంటారు. వాళ్లకి ఇలాంటి ఆలోచనే వచ్చినట్లే ఉండి ఉంటుంది. అయితే వాళ్ళు అంతటితో ఊరుకోలేదు. అసలు విషయంలోకి వెళ్తే చైనా పరిశోధకులు మనుషులలాగే కనిపించే ఒక మరమనిషిని తయారు చేసారు.

'యూనివర్సిటీ ఆఫ్ చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ' పరిశోధకులు 'జియా జియా' అనే ఈ మరమినిషిని తయారు చేసారు. ఈ జియ ముఖ కవళికలు మరియు వేరే వారి ప్రశ్నలకు సమాధనంగా తల ఊపడం చేస్తుంది. ఈ రోబోట్ ఒక మహిళ రూపంలో ఉంది. అయితే జియా జియా యొక్క ప్రత్యేకత ఏంటంటే తన చుట్టూ ఉండే వాళ్ళను స్పర్శించి కొంత స్థలం అడుగుతుంది. పరిశోధకులు మూడు సంవత్సరాల పాటు కష్టపడి జియా జియా మాట్లాడుతుంటే నోరు కదలికలను తీర్చిదిద్దారు.

English summary

Realistic lady robot in China. China researchers invented realistic lady Robot. That lady robot will chat with humans and it is looking very beautiful.