స్వామిజీ అవతారం ఎత్తిన సైకిళ్ళ దొంగ(వీడియో)

Reality tv godman Swami Omji Maharaj accused

10:59 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Reality tv godman Swami Omji Maharaj accused

ఎన్ని వేషాలు వేయడానికైనా చాలా ఈజీగా కనిపించే వేషం స్వామీజీల ముసుగు... అందుకే, స్వామీజీల పేరు చాటున దొంగ పనులు చేస్తూ భక్తి ముసుగులో తప్పించుకు తిరిగే స్వాములకు భారతదేశంలో కొదవలేదు. కొంతమంది దొంగ స్వాములైతే జనాకర్షణ పెంచుకుని సెలబ్రిటీలుగా వెలిగిపోతున్నారు కూడా! అలా స్వామిజీ ముసుగులో ఏకంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాల్టీ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. రియాల్టీ టీవీ స్వామి సదాచారి సాయిబాబా ఓమ్ జీ మహరాజ్ దొంగస్వామి అంటూ అతగాడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిరీస్-10లో కనిపించిన ఈయన... దైవిక శక్తులు కలిగిన వ్యక్తిగా, భక్తులను మభ్యపెడుతూ మోసపుచ్చాడన్న ఆరోపణలు బలంగా వున్నాయి. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, సైకిళ్ల దొంగతనం, ఆడపిల్లల ఫోటోలు దొంగిలించి సంబంధిత మహిళల నుంచి డబ్బు వసూలు చేసిన దొంగస్వామి మీద పోలీసులు టాడా, ఇతర కేసులు నమోదు చేశారు. రెండు రోజుల కిందట స్వామిని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఆయా కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకాని నేరం కింద సదాచారిని త్వరలోనే కటకటాల వెనక్కి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తనకు అతీంద్రియ శక్తులున్నాయంటూ బిగ్ బాస్ రియాల్టీ షోలో ఫోజులు కొట్టే బాబా అసలు రంగు బయటపడటంతో భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఇదే బాబాపై టీవీ ఛానెల్ లైవ్ లో మహిళలు చేయి చేసుకున్నారు కూడా!

English summary

Reality tv godman Swami Omji Maharaj accused