అమలాపాల్ విడాకులకు కారణం చెప్పిన మామ!

Reason behind Amalapaul divorce issue

04:22 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Reason behind Amalapaul divorce issue

గత కొంత కాలంగా సినీనటి అమలాపాల్ విడాకులు గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ విడాకులపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని ఆమె మామ, సినీ నిర్మాత అళగప్పన్ తెలిపారు. అమలాపాల్, ఆమె భర్త ఎ.ఎల్.విజయ్ మధ్య విభేదాలు వాస్తవమేనని ఆయన చెప్పారు. విభేదాల కారణంగా వారు విడిపోయారని, ఇక చట్టపరంగా విడాకులు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వివాహానంతరం అమలాపాల్ నటించడం తమ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. తొలుత అమలాపాల్ కూడా అందుకు అంగీకరించినట్టే కనిపించిందని, అయితే వివాహం తరువాత కూడా సినిమాలు అంగీకరించిందని, ఇది విజయ్ కు నచ్చలేదని అన్నారు.

దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని వెల్లడించారు. ఆ తరువాత వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భంగా ఇకపై సినిమాలు అంగీకరించనని చెప్పిందని, ఆ మాటకు తిలోదకాలిచ్చి పాటలు పాడుతోందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా సూర్య, ధనుష్ సినిమాల్లో కూడా నటిస్తోందని మండిపడ్డారు. కుటుంబం మాట పట్టించుకోకుండా సినిమాలు చేయడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే తన కుమారుడు ఏం మాట్లాడాడో తెలియదని, తమకు తమ కొడుకు ముఖ్యమని చెప్పారు. వారిద్దరూ విడిపోవడం నిజమేనని, చట్టపరంగా మాత్రమే విడిపోవాల్సి ఉందని తెలిపారు. దీంతో ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ వ్యక్తిగత జీవితం ఇలా అయిపోయిందేమిటా? అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

English summary

Reason behind Amalapaul divorce issue