అసలు చిరు మాటివి ప్రోగ్రామ్ ఎందుకు వద్దనుకున్నట్టు?

Reason behind Chiranjeevi live performance in Maa awards 2016

10:46 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Reason behind Chiranjeevi live performance in Maa awards 2016

మొన్ననే కదా మాటివి అవార్డ్స్ ఫంక్షన్ లో స్టెప్పులేసి అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవికి ఇంతలోనే ఏమైంది? అసలు మాటివి ప్రోగ్రామ్ వద్దనుకోవడానికి కారణం ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు కలవరపరుస్తున్నాయి. కానీ ఇది నిజం.. మరి ఈ సస్పెన్స్ కి తెర పడాలంటే ఓ సారి వివరాల్లోకి వెళ్లాల్సిందే. మా టీవీ వాళ్ళు వచ్చి.. అవార్డుల కార్యక్రమంలో ప్రోగ్రాం చేయమన్నప్పుడు నేను ఒప్పుకోలేదు. అందుకు నేను సుముఖంగా లేను. ఓ పక్క నా రీఎంట్రీ మూవీకి సంబంధించి కథా చర్చలు.. మరోపక్క కాస్ట్యూమ్స్ లాంటి పనులతో తీరిక లేకుండా ఉన్నా. ఇలాంటి టైంలో ఇది ఎక్ స్ట్రా ప్రెజర్ అవుతుందనిపించింది.

తర్జనభర్జన పడ్డా, పైగా ఓ మైల్ స్టోన్ మూవీ చేయబోతూ.. ఇలా ఓ అవార్డుల కార్యక్రమంలో కనిపించడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నా, అందుకే వద్దన్నా. కానీ మా టీవీతో నాకు మొదటి నుంచి ఆత్మీయ అనుబంధం ఉంది. పైగా వారితో నాకు వ్యాపార బంధం కూడా ఉండనే ఉంది. ఇక అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ల అభ్యర్థనను ఒప్పుకోవాల్సి వచ్చింది. పైగా నా సినీ రీఎంట్రీకి ఇది ఓ టెస్టులాగా కూడా ఉంటుందని ఒప్పుకున్నా. ఇక ఒకే చెప్పేయడంతో, ఆ ప్రోగ్రాం కోసం ఆరు గెటప్పులు.. 5 పాత్రలు వేశా. ఒకే రోజు వీటన్నింటి షూటింగ్ పూర్తి చేసేశారు. రిహార్సల్ చూసుకుని గ్యాంగ్ లీడర్ పాటకు స్టెప్పులేశా అని మెగాస్టార్ వివరించాడు.

శ్రీకాంత్, సునీల్, నవదీప్, సాయిధరమ్ తేజ్ వీళ్లందరూ కూడా నాతో డ్యాన్స్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆ పాటకు డ్యాన్స్ చేస్తుంటే నా ఒంట్లో తెలియని ఉత్సాహం నిండిపోయింది. నా నుంచి జనం ఏం కోరుకుంటున్నారో అది అందించా. అందరూ మెచ్చుకున్నారు. సంతోషించారు అని చిరంజీవి ఆనందంతో చెప్పుకొచ్చారు. సో.. వద్దనుకుని వెళ్లి, స్టెప్పులతో అదరగొట్టేసిన చిరు అటు మాటివి వాళ్ళను, ఇటు అభిమానులను కూడా సంతోష పరిచాడు. అదండీ సంగతి.

English summary

Reason behind Chiranjeevi live performance in Maa awards 2016