రజనీ ఆరోగ్యం దెబ్బతినడానికి సోదరుడే కారణం.. ఓ అభిమాని షాకింగ్ కామెంట్స్

Reason behind Rajinikanth health sickness

11:07 AM ON 27th June, 2016 By Mirchi Vilas

Reason behind Rajinikanth health sickness

అభిమానానికి హద్దు ఉండదు. అది ఎంత పనైనా చేయిస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు.. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నట్లు కొన్ని రోజులుగా చెన్నైలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో రజినీ కుటుంబ సభ్యులు కానీ.. సన్నిహితులు కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే అభిమానుల్లో మాత్రం రజినీ ఆరోగ్యం విషయమై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ వచ్చింది కూడా... ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులోని మధురై జిల్లా రజినీకాంత్ అభిమానుల సంఘం సభ్యుడు శేఖర్.. మధురైలో అంటించిన పోస్టర్లు కలకలం సృష్టించాయి.

రజినీ సోదరుడు సత్యానారాయణ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ శేఖర్ ఆ పోస్టర్లు వేశాడు. రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్, లింగా సినిమాలు పరాజయం పాలవడానికి.. రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బ తినడానికి ఆయన సోదరుడు సత్యనారాయణే కారణమని ఈ పోస్టర్లో ఆరోపించాడు. అంతే కాక గత ఏడాది ఏప్రిల్లో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజినీ క్షేమం కోరుతూ తాను ఓ విషయాన్ని సత్యనారాయణకు చెప్పానని.. కానీ అతను రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి ఆ విషయం తీసుకెళ్లలేదని.. అందువల్లే ప్రస్తుతం రజినీ ఇబ్బంది పడుుతున్నాడని శేఖర్ ఆరోపణ.

అప్పుడు జరిగిన తప్పుకు తాను మధురై మీనాక్షి దేవాలయంలో పరిహారం కూడా చెల్లించనున్నట్లు వెల్లడించాడు. అయితే సత్యనారాయణ మీద శేఖర్ తీవ్ర ఆరోపణలు గుప్పించడం.. విమర్శలు చేయడంపై కొందరు రజినీ అభిమానులకు ఆగ్రహం కలిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు.

English summary

Reason behind Rajinikanth health sickness