పవన్ కార్ అమ్మింది ఎందుకో తెలిస్తే ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తారు!

Reason behind that why Pawan Kalyan sold his car

03:34 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Reason behind that why Pawan Kalyan sold his car

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన సినిమాలు చూసి ఇష్టపడిన దానికంటే ఆయన వ్యక్తిత్వం చూసి ఇష్టపడేవాళ్ళే ఎక్కువ. అందుకే టాలీవుడ్ లో పవన్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో పవన్ చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని ఆ పార్టీకి ప్రచారం చేసాడని, తెదేపా ఇచ్చిన ప్యాకేజీకి అమ్ముడుపోయాడని కొంతమంది సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు వల్లే జగన్ ఓడిపోయాడని లేదంటే జగన్ గెలిచేవాడని వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆగ్రహం. అయితే నిజంగా పవన్ డబ్బులు తీసుకుని తెదేపాకి ప్రచారం చేస్తే పవన్ కి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి? డబ్బులు కోసం తనకు ఇష్టమైన కారుని ఎందుకు అమ్ముకుంటాడు?

డబ్బు కోసమే పవన్ పని చేసే వాడైతే.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయి 4 నెలలు కావొస్తున్నా మరో కొత్త సినిమా ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? మరో ఏడాదిలో సినిమాలకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్న పవన్, డబ్బు కోసం ఎడా పెడా మూడు నెలలకు ఒక సినిమా చొప్పున తీసేయొచ్చుగా? వీటన్నిటికీ ఒకటే సమాధానం. పవన్ డబ్బు కోసం ఏ పనీ చేయడు. తాను ఏ పని చేసినా ఆయన మనసుకు నచ్చితేనే చేస్తాడు. అసలు విషయం ఏమిటంటే తాజా సమాచారం ప్రకారం పవన్ తనకు ఇష్టమైన కారుని అమ్మేసింది తన అవసరాల కోసం కాదు, కొంతమంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించడానికి తనకి ఇష్టమైన కారుని అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుని ఆ పిల్లలకు విరాళంగా ఇచ్చారట. ఈ విషయం విన్న ఎంతో మంది పవన్ ని అభిమానించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు!

English summary

Reason behind that why Pawan Kalyan sold his car