డ్రింక్స్ తాగే ముందు ఛీర్స్ ఎందుకు కొడతాం.?

Reason Behind Why People Say Cheers Before Drinking

10:53 AM ON 18th April, 2016 By Mirchi Vilas

Reason Behind Why People Say Cheers Before Drinking

డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాకించి ఛీర్స్ చెప్పుకోడం చూస్తూంటాం .. నిజంగా ఇప్పుడది సెలబ్రేషన్ సింబల్ అని చెప్పవచ్చు. కానీ దీనివెనుక ఓ ఇంటరెస్టింగ్ స్టోరీ వుంది. ఇది ఒక అనుమానపు చేష్టగా ఆరంభమైందట. ఎప్పుడంటే ... మధ్యయుగం లో ... అది కూడా ఆనాటి సముద్రపు దొంగలు ఈ సంప్రదాయానికి ఆద్యులట. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దీవిపై దిగేవారు. అయితే కొందరు దొంగలు తమతోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని(చెక్క లోటాలు) మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం. అలా చేసేప్పుడు వారు 'ఛీర్స్ (ఛీర్ అంటే ఆనందించు, ఉత్సాహపడు, ఊరటచెందు)' అనుకునేవారు. అంటే చావు భయం వద్దు ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావనట. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్ చెప్పుకునే సంప్రదాయం మొదట బ్రిటన్లోకి, ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మనదాకా చేరిందట. భలే వుంది కదా .. అవును మరి ప్రతిదానికీ ఓ హిస్టరీ వుంటుంది.

ఇవి కూడా చదవండి:

పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు

జడేజా పెళ్లిలో కాల్పులు - పోలీసుల దర్యాప్తు

పూరీ పై లోఫర్ దాడి

English summary

Here is the history and story behind why people say cheers while drinking.