పుష్కరాలకు పవన్ అందుకే రాడట

Reason for Pawan Kalyan not attending Krishna Pushkaralu

11:55 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Reason for Pawan Kalyan not attending Krishna Pushkaralu

అటు సినిమాల్లో కానీ, ఇటు రాజకీయాల్లో కానీ, పవర్ స్టార్.. పవన్ కల్యాణ్ అడుగేసాడంటే అది ఒక సంచలనం సృష్టించి తీరాల్సిందే. అందుకే, టాలీవుడ్ లో పవన్ అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఏడేనిమిదేళ్ల నాడు రాజకీయ ప్రవేశం చేసినా సింహంలా గర్జించాడే కానీ, ఏదో అలా వచ్చి ఇలా వెళ్లాడు అనిపించేలా ప్రవర్తించలేదు. మళ్లీ రెండేళ్ల క్రితం కూడా జనసేనతో ప్రభంజనమే సృష్టించాడు. నాడు టీడీపీ, బీజేపీ కూటమికి వెలుపలి నుంచి నైతిక మద్దతు ఇచ్చి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ను కూకటి వేళ్లలో పెకలించివేయడంలో జనసేన పాత్ర అద్వితీయం అంటారు అందరూ. పలు అంశాల్లో స్పందిస్తూ వచ్చిన పవన్ ఈ మధ్య కొంత నిర్లిప్తంగా వున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. దీంతో మరోసారి పవన్ పేరు తెరమీదికి వచ్చింది. పుష్కరాలకు బిజీబిజీగా ఉన్న పవన్ వెళతాడా, వెళ్లాడా, అనే అంశం సహజంగానే హాట్ టాపిక్ గా మారింది. అయితే పుష్కరాలకు రావాలని సీఎం చంద్రబాబు స్వయంగా పిలువలేకపోయినా, ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పవన్ దగ్గరికి పంపారు. పవన్ ఇంటికెళ్లిన పల్లె జనసేనాని ఆత్మీయంగా పలకరించి పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు. అయితే పవన్ జ్వరంతో ఉన్నందున పుష్కర స్నానాలకు హాజరు కాడని తేలిపోయిందట. సహజంగానే ఇది అభిమానుల్లో కాస్త అసంతృప్తి కలిగించిందని అంటున్నారు.

అయితే ప్రభుత్వం పవన్ ను పుష్కరాలకు పిలువలేదు.. రాష్ట్రంలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు పవన్ వంటి నేతను ఆహ్వానించకపోతే ఎలా? అంటూ సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. మొత్తానికి ఇదివరకటి మాదిరిగా కాకుండా ఈసారి పక్కా ప్రణాళికతో రాజకీయాల్లో తన పాత్ర వుండాలని కోరుకుంటున్న పవన్ అందుకు తగ్గట్టు కొంత దూరం పాటిస్తున్నాడని కొందరు అంటున్నారు.

English summary

Reason for Pawan Kalyan not attending Krishna Pushkaralu