రాష్ట్రపతి వెనుదిరగడానికి 'అగ్ని'  కారణమా? 

Reason For Pranab Not Attended To Ayutha Chandi Yagam

12:18 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Reason For Pranab Not Attended To Ayutha Chandi Yagam

మెదక్ జిల్లా ఎర్రవల్లిలో 5 రోజులపాటు తెలంగాణా సిఎమ్ కెసిఆర్ వ్యక్తిగత హోదాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగానికి చివరి రోజు అగ్ని ప్రమాదం మినహా యాగం విజయవంతంగా ముగిసింది. అయితే కెసిఆర్ ఆహ్వానం మేరకు అయుత చండీయాగానికి వచ్చిన రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ తీరా యాగస్థలికి రాకుండానే వెను దిరిగి వెళ్ళిపోవడానికి అక్కడ జరిగిన అగ్ని ప్రమాదమా , మరో కీలక కారణం ఉందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎంతో అట్టహాసంగా నిర్వహించిన చండీయాగానికి పలువురు ప్రముఖులు , వి ఐ పిలు , లక్షల్లో భక్తులు విచ్చేశారు. చివరిరోజు ఎపి సిఎమ్ చంద్రబాబు వచ్చారు. ఇక యాగం పూర్తయ్యే చివరి రోజున జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమం లో రాష్ర్టపతి ప్రణబ్ ముఖ్య అతిథి. గా పాల్గొని ఆయన ఆధ్వర్యంలో ముగింపు పలకాల్సి వుంది. ఇంతలోనే దురదృష్టవశాత్తు నిప్పు అంటుకొని యాగశాల దగ్దం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉన్న రాష్ర్టపతి తన ప్రత్యేక హెలీకాప్టర్ లో అక్కడికి చేరుకు న్నారు. .యాగశాల దగ్దం అవుతున్న సమయంలో ల్యాండింగ్ కోసం ఎదురుచూస్తున్న రాష్ర్టపతి అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇంతవరకూ బానే వున్నా , అసలు రాష్ట్రపతి అక్కడి దాకా వచ్చి వెనక్కు వెళ్ళిపోవడానికి అగ్నిప్రమాదం అసలు కారణం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే అప్పటికే అయుత చండీయాగానికి వెళ్లవద్దని సామాజిక వేత్త - తార్కికవాది అయిన స్వామి అగ్నివేశ్ రాష్ర్టపతిని కోతుతూ బహిరంగ లేఖ రాశారు. . " చండీయాగం వంటివన్నీ లాజికల్ గా నిరూపితం అయినవి కావు. అలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల అద్భుతాలు జరుగుతాయనే ప్రచారం జనంలోకి వెళుతుంది. రాజ్యాంగ పెద్ద అయిన మీరు ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు"అని అగ్నివేష్ ఆలేఖలో కోరుతూ ....'ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనూ తార్కికవాదాన్ని ప్రోత్సహించాలని చెప్పిన .విషయాలన్ని పరిగణనలోకి తీసుకోవాలి' అంటూ అగ్నివేశ్ ప్రస్తావించారు . మొత్తానికి రాష్ర్టపతి అక్కడ దాకా వెళ్ళినా కూడా ఆ కార్యక్రమంలో హాజరుకాకుండా రావడం వెనుక అగ్ని ప్రమాదం కారణం అయినా, అగ్నివేష్ లేఖ అంశం తెరమీదికి వచ్చింది. మొత్తానికి కారణం మాత్రం 'అగ్ని' ప్రభావంగానే చెప్పవచ్చు.

కాగా ప్రమాదం విషయానికి వస్తే , చండీయాగం ప్రాంగణంలో చివరిరోజు ఆదివారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో యాగశాలలో వున్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు.

హోమగుండం నుంచి వచ్చిన అగ్నితో కుటీరానికి మంటలు అంటుకుని ప్రమాదం సంభవించిందని, అయితే సకాలంలో స్పందించిన సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారని ప్రత్యక్ష సాక్షుల కధనం. యాగశాల పైకప్పును గడ్డితో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అక్కడే వున్న పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, యాగం విరామం సమయంలో ఇది జరిగిందని, యాగం ముగింపు కార్యక్రమాలు యథావిధిగా సాగాయి..

English summary