పీవీ-సోనియా మధ్య గొడవకు అసలు కారణం ఇదే!

Reason for PV Narasimha Rao and Sonia trash

12:53 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Reason for PV Narasimha Rao and Sonia trash

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి, ఇప్పుడు మరో ఆత్మకథ వచ్చింది. ఇప్పటికే వచ్చిన ఆత్మకథలు.. పుస్తకాలలో చూస్తే, పీవీ నరసింహరావు-సోనియాగాంధీ మధ్య సత్ సంబంధాలు లేవని.. పీవీ అంటే సోనియాకు గిట్టదని.. అందుకే, పీవీని దూరంగా ఉంచటమే కాదు.. ఆయన చనిపోయిన తర్వాత పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకురానివ్వకుండా భౌతిక కాయం మీద కూడా రివెంజ్ తీర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పీవీని సోనియా అవమానించినట్లు చెప్పటమే తప్ప, అసలు సోనియాగాంధీ అంత కఠినంగా.. దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించారు? అసలు వారిద్దరి మధ్య గొడవకు మరీ అంతగా వ్యతిరేకించటానికి అసలు కారణం ఏమిటి?

లాంటి ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం ఇంతవరకూ ఎవరూ సమాధానం ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ చెప్పినా పీవీ కోణంలో చెప్పేవారే కానీ.. సోనియా కోణంలో చెప్పేవారు కనిపించరు. అయితే ఆ లోటును తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరేట్ అల్వా భర్తీ చేస్తూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారని అంటున్నారు. ఎందుకంటే, ఆమె తాజాగా కరేజ్ అండ్ కమిట్మెంట్ పేరిట తన ఆత్మకథను పుస్తక రూపంలో తెచ్చారు. పీవీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన ఆమె.. సోనియాకు.. పీవీకి మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? పీవీని సోనియా అంతగా ఎందుకు, వ్యతిరేకించారు? లాంటి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు 1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టి వేస్తూ, ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే, ఈ ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలని నాడు ప్రధానిగా ఉన్న పీవీ డిసైడ్ చేయటమే సోనియాకు ఆగ్రహం కల్గించినట్లు సదరు పుస్తకంలో ఆల్వా పేర్కొన్నారు. అప్పట్లో సిబ్బంది వ్యవహారాల శాఖను చూస్తున్న మార్గరెట్ అల్వాను సోనియా పిలపించుకొని, బోఫోర్స్ విషయంపై పీవీ సర్కారు నిర్ణయాన్ని ఆరా తీసారట. అయితే.. ప్రధాని కార్యాలయం నుంచే ఈ ఆదేశాలు వెళ్లాయి. నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినట్లుగా ఆ పుస్తకంలో చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సోనియాగాంధీ.. ప్రధాని ఏం చేయాలనుకుంటున్నారు. నన్ను జైలుకు పంపాలనుకుంటున్నారా? పీవీ సర్కారు నా కోసం ఏం చేసింది? ఈ ఇంటిని చంద్రశేఖర్ ప్రభుత్వమే కేటాయించింది.

నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ ఎలాంటి ప్రయోజనాల్ని ఆయన నుంచి కోరటం లేదు అని తీవ్రస్థాయిలో తన వద్ద ఫైర్ అయినట్లుగా అల్వా ఆత్మకథలో పేర్కొన్నారు. పీవీతో ఆమెకు పడకపోవటానికి మరిన్ని కారణాలు చెబుతూ, ఆయన్ను ఎంతమాత్రం నమ్మినట్లు కనిపించలేదు. రాజీవ్ గాంధీ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక వేత్త చంద్రస్వామితో పీవీ క్లోజ్ గా మూవ్ కావటం కూడా ఒక కారణం అట. అందుకే ప్రధానికి దూరంగా ఉంటూ, ఆయన్ను బలహీనుడ్ని చేయాలని సోనియా ఎప్పుడూ అనుకునే వారు. బాబ్రీ ఘటన.. తర్వాత కాలంలో బోఫోర్స్ ఇష్యూలో సుప్రీం అప్పీలు చేయటంతో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, అనుమానాలు మొదలయ్యాయి అని ఆమె తన పుస్తకంలో స్పష్టం చేశారు.

English summary

Reason for PV Narasimha Rao and Sonia trash