హన్సికకి సడన్ గా టాలీవుడ్ లో అన్ని ఆఫర్స్ రావడానికి కారణం తెలిస్తే షాకౌతారు!

Reason for why Hansika getting more offers in tollywood

12:36 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Reason for why Hansika getting more offers in tollywood

'దేశముదురు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం లంకలో, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దూసుకెళ్తా వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత ఈ అమ్మడుకి అవకాశాలు కాస్త తగ్గడంతో తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అయింది. అక్కడ హన్సిక నటించిన రెండు మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో అమ్మడుకి వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. దీంతో హన్సిక పూర్తిగా తెలుగు సినిమాల్లో నటించడం మానేసింది. తమిళ పరిశ్రమలో దాదాపు నాలుగేళ్లు స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే 2014లో రవితేజ 'పవర్' సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆ తరువాత మళ్ళీ తమిళంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడుకి తమిళంలో అవకాశాలు తగ్గుతుండడంతో మళ్ళీ తెలుగులో తన లక్ ను పరీక్షించుకోవడానికి వచ్చేసింది. అయితే ఈ అమ్మడు తమిళంలో తీసుకునే పారితోషికంలో సగం మాత్రమే తెలుగు సినిమాకి తీసుకుంటుంది. దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు మళ్ళీ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హన్సిక హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా, మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రంలో కూడా హన్సికనే ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ అమ్మడుకి మళ్ళీ తెలుగులో పూర్వ వైభవం ఖాయమంటున్నారు సినీ పండితులు.

ఇది కూడా చదవండి: అభిమన్యుడుని చంపడానికి రచించిన పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి ప్లాన్ ఇదే!

ఇది కూడా చదవండి: వాట్సప్ లవర్స్ కోసం కొత్త అప్ డేట్ వచ్చేసింది

ఇది కూడా చదవండి: ఈయన్ని కృష్ణుడు గా వద్దన్నారు

English summary

Reason for why Hansika getting more offers in tollywood. Hansika reduced half of the remuneration for telugu movies than that she was taken for tamil movies.