ఆ ఫంక్ష‌న్‌కు సమంతా ఎందుకు రాలేదు?

Reason for why Samantha not attends Janatha Garage audio launch

12:20 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Reason for why Samantha not attends Janatha Garage audio launch

ఈమధ్య లవ్ అఫైర్ తో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయమంటూ హీరోయిన్ సమంత గురించి రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' ఆడియో ఫంక్షన్ కి డుమ్మా కొట్టింది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రారంభం నుంచే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీజర్ తో తమ కాంబినేషన్ పై అంచనాలను మరింత పెంచేశారు. వర్కింగ్ ఫోటోలతో ఎప్పటికప్పుడూ మీడియాలో నిలిచిన జనతా గ్యారేజ్ ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా జనతా గురించే చర్చ జరిగేలా చేశారు.

1/4 Pages

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఎంతో వైభవంగా నిర్వహించారు. అతిరథమహారథులు హాజరైన ఈ ఫంక్షన్ కు ఈ సినిమాలో హీరోయిన్ సమంత మాత్రం హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఇంకా కొద్ది గంటల్లో ఈ ఫంక్షన్ మొదలవుతుందనగా, నాకు బాగాలేదు. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో మిమ్మల్నందరినీ మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేసింది. అయితే, ఈ ఫంక్షన్ కు డుమ్మా కొట్టడం వెనుక చైతూ ఉన్నట్లు టాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, కొద్ది కాలంగా చైతూ, సమంత ప్రేమ పెళ్లి వ్యవహారం మీడియాలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

English summary

Reason for why Samantha not attends Janatha Garage audio launch