మెగా బర్త్ డే పార్టీలో సుమ యాంకరింగ్ ఎందుకు చేయలేదో తెలుసా?

Reason for why Suma not did anchoring for mega event

10:28 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Reason for why Suma not did anchoring for mega event

అన్ని టివీల్లోనూ సుమ యాంకరింగ్ ప్రోగ్రామ్ లే. అంతేకాదు, ఈ మధ్యన సినిమాలకు సంబంధించి ఎటువంటి మెగా ఈవెంట్ అయినా కూడా యాంకరింగ్ అంతా సుమ చేతుల్లోనే పెట్టేస్తున్నారు. పైగా సుమ ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్న షోలలో కూడా మెగా హీరోలు బానే పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ సుమకే తొలిసారి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుమ ప్రోగ్రామ్స్ లో దాదాపు మెగా హీరోలందరూ పాల్గొంటారు. అంతా బానే వుంది కానీ, సుమ.. మొన్న శిల్పకళావేదికలో చిరంజీవి 61వ బర్త్ డే సెలబ్రేషన్లకు మాత్రం యాంకరింగ్ చేయలేదు. కారణం ఏంటబ్బా అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. అసలు విషయం కూపీ లాగితే, ఆ కార్యక్రమానికి సుమతో యాంకరింగ్ కావాలనే చేయించలేదని తెలుస్తోంది.

ఎందుకంటే అది ఫ్యాన్స్ చేస్తున్న బర్త్ డే వేడుక అని రామ్ చరణ్ చెప్పకనే చెప్పాడు. జరిగేది ఫ్యాన్స్ పేరుతోనే కాని ఖర్చంతా మెగా కుటుంబానిదేనని అందరికీ తెలుసు. కాకపోతే మరీ ఖరీదైన యాంకర్ సుమను పిలిస్తే, ఖచ్చితంగా అందరికీ ఆ సీక్రెట్ లీక్ అయిపోతుంది కాబట్టి, మనోళ్ళు శ్యామలతో సరిపెట్టేశారని తెలుస్తోంది. అయితే సుమ యాంకరింగ్ చేసిందా చేయలేదా అనేది కూడా పెద్ద న్యూసేనా అనుకునే జనాలు కూడా ఉన్నారు. ప్రస్తుతం సుమకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, అసలు ఆమె యాంకరింగ్ చేయాల్సిందే. లేకపోతే ఆ ప్రోగ్రామ్ కు విలువేలేదు అనేంతగా పరిస్థితి మారిపోయింది. కాబట్టి సుమ చేసిందా చేయలేదా అనే విషయంపై డిస్కషన్లు వస్తుంటాయి మరి.

English summary

Reason for why Suma not did anchoring for mega event