ఊరి దత్తత వెనుక మహేష్ స్వార్ధం దాగుందా!?

Reasons behind Mahesh Babu adopting village

09:57 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Reasons behind Mahesh Babu adopting village

తాను దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా తెనాలి దగ్గరలోని తన సొంతూరు బుర్రిపాలెం వెళ్లి అక్కడ పలు కార్యకమాల్లో పాల్గొని హల్ చల్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుకి అంత సీన్ లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. నిజానికి 'ఊర్ని దత్తత తీసుకోవడం అంటే జేబులో నుంచి నాలుగు డబ్బులు తీసి రోడ్లు, రంగులు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా..' అంటూ మహేష్ 'శ్రీమంతుడు' సినిమాలో డైలాగ్ చెబుతుంటే అభిమానులు ఈలలు వేసి గోలలు చేశారు.. కానీ ఒరిజినల్ గా అతనికంత సీన్ లేదనేది లేటెస్ట్ బుర్రిపాలెం టూర్ తోనే తేలిపోయిందని పలువురు అంటున్నారు.

నెట్ లో ఈ మేరకు కామెంట్లు కూడా పడుతున్నాయట. స్వార్థం కోసం ఏ ఊరినైనా దత్తత తీసుకునే నైజం ఈ శ్రీ(ఛీ)మంతుడిదని బుర్రిపాలెం టూర్ చెప్పకనే చెప్పిందంటూ సోషల్ సైట్లలో కధనాలు, విశ్లేషణలు వచ్చేసాయి. అయితే ఈ విమర్శల్లో ఎంత నిజముందో, లేక కావాలనే కొందరు పనిగట్టుకుని బాడ్ చేయడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారా అనేది పక్కన పెడితే, ఈ టూర్ సందర్భంగా మహేష్ పై వచ్చిన విమర్శలను ఓసారి ప్రస్తావిస్తే, 'మహేష్ బాబు చెప్పిందానికి.. చేస్తున్నదానికి ఎక్కడా పొంతన లేదు సరికదా.. జనాల అమాయకత్వాన్ని కూడా బిజినెస్ చేసుకుంటోన్న పక్కా కమర్షియల్ బిజినెస్ మేన్ అని ఆ టూర్ చెబుతోంది.

మరి నిన్నటి వరకూ శ్రీమంతుడిలా గ్రామాల్ని దత్తత తీసుకుంటానని ఫోజు కొట్టిన మహేష్ బాబును అంతా అబ్బో మనోడు సూపర్ అనుకున్నారు.. కానీ అంత సీన్ లేదని చెప్పడానికి బుర్రిపాలెం పర్యటనలో కనిపించిన చేదు నిజాలెన్నో ఉన్నాయి. అతడు దత్తత కాన్సెప్ట్ తో ఆ సినిమాకే కాదు.. రాబోయే సినిమాలనూ హిట్ చేసుకునే పక్కా బిజినెస్ మేన్ అనేది లేటెస్ట్ వెర్షన్' అంటూ కామెంట్లు పడుతున్నాయి. అసలు ఇలాంటి విమర్శలు రావడానికి గల కారణం చూస్తుంటే, నిజానికి మహేష్ బాబు బుర్రిపాలెం వెళ్లాలని వెళ్లలేదు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని ప్రాంతంలో ఓ బిజినెస్ మేన్ రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఓపెనింగ్ చేయడానికి ఓ భారీ డీల్ కుదుర్చుకుని వెళ్లాడన్నది ఆరోపణ.

అయితే అక్కడి వరకూ వెళ్లాక బుర్రిపాలెం పక్కనే ఉంది కదా అని ఆ ఊరికి వెళ్లాడట.. మరి గతంలోనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పడం వలన ఆ పర్యటనలో ఇది కూడా కలిసొచ్చేలా, మహేష్ పెద్ద బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇక ఆ ప్లానింగ్ లో మహేష్ బాబు అద్భుతమైన నటన చూపించాడని అంటున్నారు. తను దత్తత తీసుకున్న గ్రామంలో రుణాలను పంపిణీ చేశాడు.. గ్రామస్తులకు హెల్త్ కార్డులు అందించాడు.. అంతేనా.. తాను విద్య, వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని పొలిటీషియన్ రేంజ్ లో స్పీచులు కూడా ఇచ్చాడు.. అయితే ఇక్కడే ఓ భారీ ట్విస్ట్ ఉందట.

మహేష్ బాబు పంచిన రుణాలు అతను ఇచ్చినవి కావని, ప్రభుత్వ పథకాలకు చెందినవని, అలాగే హెల్త్ కార్డులను కూడా విజయవాడకు చెందిన ఓ హాస్పిటల్ వాళ్లు మహేష్ పేరు వేసిన హెల్ట్ కార్డులను పంచారని, వాటిని మహేష్ చేతుల మీదుగా అందించారని గాలి తీసేస్తున్నారు. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలను మహేష్ ఏ అర్హతతో అందించాడన్నది ఇక్కడ మరో ప్రశ్న. ఎన్నికల టైమ్ లో కనీసం తన బావ తరఫున కూడా ప్రచారం చేయని వాడు.. ట్విట్టర్ లో కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడని వాడు.. ఇప్పుడు ఏకంగా తను దత్తత తీసుకున్న గ్రామంలో పథకాలను పంచాడంటే ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు గుస్పా అవుతున్నారట.

పోనీ బావ గల్లా జయదేవ్ కోసం చేశాడనుకుంటే ఆయనైనా ఎవరైనా ప్రభుత్వ పెద్దలతో పథకాల్ని పంచాలి కానీ ఇలా ఓ సినిమా స్టార్ తో చేయిచండం ఏంటని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జయదేవ్ పై సీరియస్ అయ్యాడని మరో కధనం. అసలు ఇదంతా 'బ్రహ్మోత్సవం' ప్రమోషన్ కోసమే మహేష్ బాబు ఇలాంటి చీప్ స్టంట్స్ చేస్తూ, బిల్డప్ ఇస్తున్నాడని కొందరి బహిరంగంగా కామెంట్లు చేసేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలు మహేష్ ని కూడా వదల్లేదని, మంచి చేస్తే చెడు వస్తుందని అంటారనడానికి ఇలాంటి విమర్శలే కారణమని మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.

ఇలా అయితే సేవ చేయాలనుకునేవారు, సాయం చేసేవారు ముందుకు ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. నిజం ఏమిటో ఆ పరమాత్మకెరుక అంటున్నారు కొందరు.

English summary

Reasons behind Mahesh Babu adopting village. Reasons behind Mahesh Babu adopting Burripalem village.