హోలీ పండుగ వెనుక ఆసక్తికరమైన కధలు

Reasons behind why we celebrate Holi

05:36 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Reasons behind why we celebrate Holi

హోలీ పండుగ ప్రతీ ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజు ఎంతో కన్నులవిందు గా రంగులతో కొట్టుకుంటూ ఆడుకుంటారు. అసలు ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటో మీకు తెలుసా ? హోలీ పండుగ వెనుక కొన్ని ఆసక్తి కరమైన పురాణగాధలు ఉన్నాయి. ఒక పండుగ వెనుక ఇన్ని గాధలు ఉండడం ఆశ్చర్యంగా ఉంది కదూ....

అసలు ఆ పురాణ కధలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రామాయణంలో ముఖ్యపాత్రలు

అమరనాధ్ యాత్ర లో శివయ్య చెప్పిన మరణ రహస్యాలు

ఇవి మీకు తెలుసా ?

1/5 Pages

హోలిక

వైష్ణవ వేదశాస్త్రం ప్రకారం, హిరణ్యకశిపుడు రాక్షసుల రాజు. తపస్సు చేసి బ్రహ్మ నుండి అమరత్వం పొందే వరాన్ని  పొందాడు. దాని ఫలితంగా అతడికి అహంకారం పెరుగుతూ వచ్చింది. దేవుళ్ళను దేవతలను పూజించడం మానేసాడు. అతడ్నే దేవుడిగా పూజించాలని కోరుకున్నాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు, విష్ణుమూర్తికి పరమ భక్తుడు. కొడుకుని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించినా ఫలించకపోయే సరికి చంపడానికి సైతం ప్రయత్నిస్తాడు. హిరణ్యకశిపుడు అతని సోదరి హోలికాని ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడిని ఆమె మంటలతో కాల్చేయమని హోలిక కి చెప్తాడు. ప్రహ్లాదుడు తండ్రి కోరిక మేరకు మంటల్లో కూర్చుంటాడు. కాని అతడు విష్ణువుని జపించడం మాత్రం ఆపడు. అతనిని మంటలు ఏమీ చేయలేకపోతాయి.

భారతదేశంలో చాలా చోట్ల హోలీ జరుపుకోవడానికి ముందు హోలికా దహనం చేసి చెడుకు ముగింపు పలికి అప్పుడు హోలీ జరుపుకుంటారు.

English summary

Here are some Reasons behind why we celebrate Holi. Some really interesting mythological stories behind Holi you might not have known of.