ఎందుకు బ్లాస్ట్ అవుతున్నాయ్?

Reasons For Blasting Of Cellphones

05:26 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Reasons For Blasting Of Cellphones

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు రాజ్యమేలుతున్నాయి. ఎవరీ చేతుల్లో చూసినా స్మార్ట్‌ఫోనే కనిపిస్తుంది. ఈ ఫోన్లు దగ్గర ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటి మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం. ఈ ఫోన్లు చూడడానికి బాగుంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు వాడకంలో జాగ్రత్త వహిస్తే చాలా మంచిగా పనిచేస్తాయి. కానీ, కొన్నిసార్లు బ్యాటరీల పేలి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. మనం పేపర్లలో చూస్తూనే ఉంటాం…. ‘ఫోన్ బ్యాటరీ పేలి ఒకరి మృతి’ అంటూ శీర్షికలతో వార్తలు వస్తూనే ఉంటున్నాయి. అసలు ఫోన్ బ్యాటరీ ఎందుకు పేలుతుందోనన్న ప్రశ్న ప్రతి సామాన్యుడిలో కదలాడుతూనే వుంటుంది. ఏదైనా వస్తువును జాగ్రత్తగా వాడుకుంటే అది ఎక్కువకాలం ఉపయోగపడుతుంది. అయితే, స్మార్ట్‌ఫోన్ విషయంలో కూడా అంతే అని చెప్పవచ్చు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఈ పేలడానికి బహుశా ఈ విషయాలు కావచ్చు. పరిశ్రమలలో బ్యాటరీలు తయారుచేసేటప్పుడు ఏర్పడే సాంకేతిక లోపాల కారణంగా పేలుతాయని చెప్పవచ్చు. ఫోన్ చెడిపోతే మెకానిక్ దగ్గరికి రిపేరింగ్‌కు ఇస్తే వారు బ్యాటరీ వద్ద ఉండే స్క్రూలను సరిగ్గా ఫిట్ చేయకపోయినా ప్రమాదాలు జరగవచ్చు. అదేవిధంగా, అధిక ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు బ్యాటరీ ఉంచినా, ఎక్కువ సేపు ఉపయోగించినా, బ్యాటరీలో లిథియం అయాన్‌ల మధ్య జరిగే రసాయనిక చర్యల మూలంగా, అధికంగా చార్జింగ్ పెట్టినా, డివైస్‌కు ఇచ్చింది కాకుండా వేరే చార్జర్‌ను ఉపయోగించినా, విద్యుత్ ఎక్కువగా ప్రసారమైనా బ్యాటరీలు పేలేందుకు అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉందంటే ఉంది అన్నట్లు కాకుండా, దాన్ని సురక్షితంగా వాడుకుంటే చాలా మంచిది.

బ్యాటరీ పేలకుండా కొన్ని జాగ్రత్తలు :

– ఫోన్‌లకు కొన్ని యాప్స్ పదేపదే డౌన్‌లోడ్ చేస్తుంటే తొందరగా వేడెక్కుతుంది. ఇలా ఫోన్ వాడకంలో వేడితే పుడితే, కొద్దిసేపు విరామం ఇచ్చి, కూల్‌అయినంక మళ్లీ వాడితే మంచిది.

– అధిక ఉష్ణోగ్రతల వద్ద స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే, హీట్ మరింత అయి, బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది.

– ముఖ్యమైన విషయమేమిటంటే…. చాలామంది రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్‌కు చార్జింగ్ పెడుతుంటారు. ఇది చాలా పొరపాటు. ఇలా చేయడం మనం ఫ్రెండ్స్, ఇంకెవరైనా చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. దీన్ని మానుకోవాలి. లేకపోతే… రాత్రంతా చార్జింగ్ అయి వేడెక్కి బ్యాటరీ పేలేందుకు అవకాశం ఉంటుంది.

– డివైస్‌కు ఇచ్చిన కంపాటబుల్ చార్జర్‌ను మాత్రమే వాడాలి. ఇతర చార్జర్‌లు వాడితే వాటి వోల్టేజ్ ఎక్కువ, తక్కువలు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇది బ్యాటరీ పేలేలా చేస్తుంది. కావున, డివైస్‌కు ఇచ్చిన చార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి.

English summary

Here are the reasons for blasting of cell phone batteries. Cell phone betteries explode due to high voltage of current,over charging,usage of un authorised charger etc. We have to avoid these thing to control the blasting of mobile phones